యూత్ హార్ట్‌బీట్ పవన్

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మూడు దశాబ్దాలు అవుతున్నా.. ఇప్పటికీ యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్పాలి. ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకూ ఆయన యూత్ హార్ట్‌బీట్‌గానే కొనసాగుతున్నారు.;

By :  S D R
Update: 2025-09-27 06:56 GMT

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మూడు దశాబ్దాలు అవుతున్నా.. ఇప్పటికీ యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్పాలి. ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకూ ఆయన యూత్ హార్ట్‌బీట్‌గానే కొనసాగుతున్నారు. ఆయన కదలిక, ఆయన మాట, ఆయన స్టైల్‌ — యూత్ క్లాప్‌లు, విజిల్స్‌గా మారిపోతూనే ఉన్నాయి.

పవన్ చేసిన ప్రతి పాత్ర ఆయన బాడీ లాంగ్వేజ్‌తో ముడిపడి ఉంటుంది. 'తొలిప్రేమ, తమ్ముడు, బద్రీ, ఖుషీ, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది' ఈ సినిమాలలోని పాత్రలన్నీ ఆయనలో సహజంగా కనిపించే ఎనర్జీకి దగ్గరగా ఉండటమే ఆయనకు కలిగిన క్రేజ్‌కి నిదర్శనం. ఇప్పుడు అదే జాబితాలోకి ‘ఓజీ’లోని ఓజాస్ గంభీర కూడా చేరిపోయాడు.

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో పవన్ చేసిన యాక్షన్, ఎమోషన్ ఆడియన్స్‌ను ముగ్ధుల్ని చేసింది. గురువు పట్ల విశ్వాసం, కుటుంబం పట్ల మమకారం, కూతురి పట్ల ప్రేమ, భార్యపై అనురాగం—ఇన్ని కోణాల్లో పవన్ జీవించిన ఈ పాత్ర ప్రత్యేకం. ఫ్యామిలీ.. మనిషిని రాక్షసుడి నుంచి మానవుడిగా మార్చగలదని చెప్పిన ఈ సందేశం యూత్ హృదయాలను తాకుతోంది. రికార్డు వసూళ్లతో దూసుకుపోతున్న ‘ఓజీ’, పవన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోనిది ఖాయం!

Tags:    

Similar News