పిటిషనర్ పై ‘ఓజీ‘ టీమ్ సెటైర్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.పై హైకోర్టు ఇటీవల స్టే విధించిన విషయం అందరికీ తెలిసిందే.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.పై హైకోర్టు ఇటీవల స్టే విధించిన విషయం అందరికీ తెలిసిందే.
ఈ స్టేకు కారణం బార్లా మల్లేశ్ యాదవ్ అనే వ్యక్తి. ఆయన టికెట్ రేట్ల పెంపు తగదని హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు తాత్కాలికంగా ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేసింది. ఇదే విషయంపై నిర్మాతలు DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ తాజాగా తమ స్టైల్లో స్పందించారు. సోషల్ మీడియా వేదికగా వారు పెట్టిన పోస్టు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ఆ పోస్టులో ‘తెలంగాణ హైకోర్టు ‘దే కాల్ హిమ్ ఓజీ’ టికెట్ హైక్ మెమోను కేవలం పిటిషనర్ బార్లా మల్లేశ్ యాదవ్‌కు మాత్రమే వర్తించేలా సస్పెండ్ చేసింది. అందుకే ఆయనకు నైజాంలో ఏ థియేటర్‌లోనైనా టికెట్‌పై ₹100 డిస్కౌంట్ ఇస్తున్నాం!. మల్లేశ్ గారు.. మా అభిమానుల్లా మీరు కూడా సినిమా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం.‘ అని డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ ‘ఎక్స్‘లో పోస్ట్ పెట్టింది.
ఈ పోస్ట్ తో DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ పిటిషనర్‌పై పరోక్షంగా సెటైర్ వేసినట్టయింది. ఇకపై టాలీవుడ్‌లో ప్రతి భారీ విడుదలకు ఇలాంటి టికెట్ పెంపు అనుమతులు వస్తాయా? లేక పూర్తిగా ఆపేస్తారా? అన్నది అక్టోబర్ 9న జరగబోయే విచారణ తర్వాతే స్పష్టత రానుంది.