వివాదంపై విజయ్ వివరణ

హైదరాబాద్‌లో ఆమధ్య జరిగిన ‘రెట్రో‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని వర్గాల్లో ఆందోళనకు దారితీశాయి.;

By :  S D R
Update: 2025-05-03 07:02 GMT

హైదరాబాద్‌లో ఆమధ్య జరిగిన ‘రెట్రో‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని వర్గాల్లో ఆందోళనకు దారితీశాయి. దీనిపై ఎస్.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ దేవరకొండ అధికారికంగా స్పందిస్తూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశాడు.




 


తన ఉద్దేశ్యం ఎప్పటికీ ఎటువంటి సమాజాన్ని, ముఖ్యంగా షెడ్యూల్డ్ తెగలవారిని బాధ పెట్టడం కాదని తెలిపాడు. తన మాటలు తప్పుడు అవగాహనకు దారితీశాయన్న విజయ్, ‘తెగ‘ అనే పదానికి నిఘంటువులోని అర్ధం, చారిత్రక నేపథ్యం వివరించాడు. ఇది ప్రాచీన సమాజ నిర్మాణానికి సంబంధించినదని, ప్రస్తుత షెడ్యూల్డ్ తెగల గుర్తింపుతో అది సంబంధం లేదన్నాడు. సమాజాన్ని విభజించే ఉద్దేశం తనది కాదనీ, శాంతి, ఐక్యతకు ప్రతినిధిగా ఉండాలనే తన నిశ్చయాన్ని ఈ నోట్ లో వ్యక్తపరిచాడు.



Tags:    

Similar News