యోధుడిలా మారిన దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో 'కింగ్డమ్' సినిమా ఈనెలలోనే ఆడియన్స్ ముందుకు వస్తోంది.;

By :  S D R
Update: 2025-05-09 13:06 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో 'కింగ్డమ్' సినిమా ఈనెలలోనే ఆడియన్స్ ముందుకు వస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మే 30న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతుంది. 'కింగ్డమ్' కోసం విజయ్ మేకోవర్ ఇప్పటికే ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఈరోజు విజయ్ బర్త్ డే స్పెషల్ గా 'కింగ్డమ్' నుంచి వచ్చిన న్యూ లుక్ ఆకట్టుకుంటుంది. అలాగే దిల్‌రాజు నిర్మాణంలో రాజ్ కిరణ్‌ కోలా దర్శకత్వంలో 'రౌడీ జనార్థన్' సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ నుంచి సైతం ఈరోజు విజయ్ బర్త్‌డే స్పెషల్ గా న్యూ లుక్ రిలీజ్ చేశారు.

మరోవైపు విజయ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఓ చిత్రాన్ని నిర్మిస్తుంది. విజయ్ దేవరకొండ 14వ చిత్రంగా రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఆద్యంతం 1854 నుంచి 1878 కాలం నాటి కథతో సాగనుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీలో విజయ్ మేకోవర్ ఎంతో సరికొత్తగా ఉండబోతుందట. ఈరోజు విజయ్ బర్త్‌డే స్పెషల్ గా ఈ సినిమా నుంచి ఓ లుక్‌ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో ధ్యానంలో ఉన్న యోధుడిలా కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే 'శ్యామ్ సింగ రాయ్' వంటి పీరియడ్ డ్రామాతో హిట్ కొట్టిన రాహుల్ సంకృత్యన్.. విజయ్ చిత్రాన్ని అంతకు మించి అన్నట్టుగా తీర్చిదిద్దుతున్నాడట. త్వరలో 'విడి 14' పట్టాలెక్కనుంది.



Tags:    

Similar News