ఆకట్టుకుంటున్న 'భైరవం' ట్రైలర్!

టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత ముగ్గురు యువ హీరోలు కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకున్న భారీ మల్టీ స్టారర్ 'భైరవం'. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ డ్రామా మే 30న విడుదల కానుంది.;

By :  S D R
Update: 2025-05-18 14:41 GMT

టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత ముగ్గురు యువ హీరోలు కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకున్న భారీ మల్టీ స్టారర్ 'భైరవం'. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ డ్రామా మే 30న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలతో అంచనాలు పెంచిన 'భైరవం' నుంచి ట్రైలర్ వచ్చేసింది.

ఒక గ్రామంలో అమ్మవారి ఆలయం, దానికి సంబంధించిన ఆస్తులను కాపాడేందుకు ముగ్గురు స్నేహితులు ఎలా ధైర్యంగా నిలబడ్డారన్నది ఈ ట్రైలర్ లో కనిపిస్తుంది. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్రెండ్షిప్, మెస్సేజ్ అన్నింటినీ సమపాళ్లలో రంగరించి డైరెక్టర్ విజయ్ కనకమేడల ఈ సినిమాని డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ముగ్గురు కథానాయకులకు సమానమైన ప్రాధాన్యత ఇస్తూ ఈ ట్రైలర్ కట్ చేశారు. ట్రైలర్ లో డైలాగ్స్ కూడా బాగున్నాయి.

'భైరవం' చిత్రం తమిళ సూపర్ హిట్ 'గరుడన్'కి అఫీషియల్ రీమేక్. అయితే తెలుగు నేటివిటీకి తగినట్లు ఈ సినిమాలో చాలానే మార్పులు చేశాడు డైరెక్టర్ విజయ్ కనకడమేడల. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ – ముగ్గురు హీరోలు ఫ్లాఫుల్లోనే ఉన్నారు. ఈ మల్టీస్టారర్ తో వీరంతా మంచి కమ్‌బ్యాక్ ఇస్తారనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ మూవీలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై, జయసుధ, అజయ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె. రాధామోహన్ నిర్మిస్తున్నారు.


Full View


Tags:    

Similar News