'పెద్ది' ఫస్ట్ షాట్ అదిరింది!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పెద్ది'. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.;
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పెద్ది'. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా రిలీజైన 'పెద్ది' ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈరోజు శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని 'పెద్ది' ఫస్ట్ షాట్ పేరుతో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆద్యంతం పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ 'రంగస్థలం' తరహాలో రస్టిక్ లుక్ లో అదరగొడుతున్నాడు. ఉత్తరాంధ్ర మాండలికంలో చరణ్ చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. మైదానంలో బ్యాట్ పట్టుకుని చరణ్ కొట్టిన ఫస్ట్ షాట్ అయితే అదుర్స్. మొత్తంగా 'పెద్ది' ఫస్ట్ షాట్ అదిరింది అని చెప్పాలి.
పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో 2026, మార్చి 27న 'పెద్ది' సినిమాని విడుదల చేయబోతున్నారు. అంటే అదే రోజు నాని 'ది ప్యారడైజ్' కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే నాని 'ది ప్యారడైజ్' ఆ సమయానికి రాకపోవచ్చనేది ఇండస్ట్రీలో వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం.