వేసవి విరామంలో SSMB29
టాలీవుడ్ నుంచి గ్లోబల్ లెవెల్ లో రానున్న ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులలో SSMB29 ముందు వరుసలో నిలస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ పాన్ వరల్డ్ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.;
టాలీవుడ్ నుంచి గ్లోబల్ లెవెల్ లో రానున్న ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులలో SSMB29 ముందు వరుసలో నిలస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ పాన్ వరల్డ్ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా షూటింగ్ కి లాంగ్ బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఎండలు మండిపోతున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి షూటింగ్‌కి తాత్కాలిక విరామం ప్రకటించాడట. దాదాపు 40 రోజుల పాటు ఈ బ్రేక్ ఇచ్చారట. జూన్ 10న మళ్లీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ విరామాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మహేష్ బాబు కుటుంబంతో విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నాడట.
తాజాగా ముగిసిన షెడ్యూల్‌లో హైదరాబాద్‌లోని ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో మహేష్, ప్రియాంక చోప్రాలపై ఒక పాటను చిత్రీకరించారు. ఈ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు కూడా పూర్తి చేశారు. జూన్ 10న ప్రారంభం కాబోయే షెడ్యూల్ లో వారణాసి నేపథ్య సన్నివేశాలను తెరకెక్కిస్తారట.
ఈ మూవీలో మహేష్, ప్రియాంక లతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, నానా పటేకర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాని 2026లో తీసుకురావాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నాడు జక్కన్న. ఒకవేళ అప్పుడు మిస్ అయితే 2027 ప్రథమార్థంలో SSMB29 వచ్చే అవకాశాలున్నాయట.