'వీరమల్లు' నుంచి స్పెషల్ నంబర్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' ప్రమోషన్స్ జోరందుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, మూడు పాటలు బయటకు వచ్చాయి. ఇప్పుడు నాల్గవ పాట విడుదలకాబోతుంది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' ప్రమోషన్స్ జోరందుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, మూడు పాటలు బయటకు వచ్చాయి. ఇప్పుడు నాల్గవ పాట విడుదలకాబోతుంది. ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో సంగీత దర్శకుడు కీరవాణి ప్రస్తావించిన 'తార తార' స్పెషల్ నంబర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది టీమ్.
'తార తార' అంటూ నిధి అగర్వాల్ చేసిన ఈ పాటను మే 28న ఉదయం 10 గంటల 20 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించి అనౌన్స్‌మెంట్ పోస్టర్ వదిలారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కి జోడీగా నిధి అగర్వాల్ కనిపించబోతుంది. అయితే.. ఒక సన్నివేశంలో నిధి స్పెషల్ నంబర్ లోనూ నర్తించబోతున్నట్టు ఈ పోస్టర్ ను బట్టి తెలుస్తోంది.
పాన్ ఇండియా లెవెల్ లో విడుదలకు ముస్తాబవుతున్న 'వీరమల్లు' రిలీజ్ కు ఇంకా 17 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఇకపై ప్రచారాన్ని మరింత వేగవంతం చేయడానికి టీమ్ కసరత్తులు చేస్తుంది. జూన్ 12న వరల్డ్ వైడ్ గా 'హరిహర వీరమల్లు' ప్రభంజనం మొదలవ్వబోతుంది.