'డ్యూడ్' నుంచి 'సింగారి' సాంగ్!

‘లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలతో యువత హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు ప్రదీప్ రంగనాథన్. లేటెస్ట్ గా ఈ టాలెంటెడ్ యాక్టర్ ‘డ్యూడ్’ మూవీతో వస్తున్నాడు.;

By :  S D R
Update: 2025-10-06 00:13 GMT

‘లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలతో యువత హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు ప్రదీప్ రంగనాథన్. లేటెస్ట్ గా ఈ టాలెంటెడ్ యాక్టర్ ‘డ్యూడ్’ మూవీతో వస్తున్నాడు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు, తమిళం భాషల్లో విడుదలకు ముస్తాబవుతుంది.

ఈ సినిమాలో ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి 'సింగారి సిన్నదానా.. నీ ఇంటి దారుల్లోనా' అంటూ సాగే గీతం విడుదలైంది. సాయి అభ్యంకర్ సంగీతం సమకూర్చి స్వయంగా పాడిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రెడీ అవుతున్న ఈ సినిమాని అక్టోబర్ 17న దీపావళి సందర్భంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.


Full View


Tags:    

Similar News