'మాస్ జాతర'లో కొత్త మాస్ బీట్

మాస్ మహారాజ రవితేజ – శ్రీలీల కాంబో మరోసారి రచ్చకు సిద్ధమవుతోంది. భాను బొగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మాస్ జాతర' అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది.;

By :  S D R
Update: 2025-10-05 14:31 GMT

మాస్ మహారాజ రవితేజ – శ్రీలీల కాంబో మరోసారి రచ్చకు సిద్ధమవుతోంది. భాను బొగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మాస్ జాతర' అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు 'తూ మేరా లవర్, ఓలె ఓలె' సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి 'హుడియో హుడియో' అంటూ సాగే మరో ఎనర్జిటిక్ సాంగ్ వస్తోంది.

ఈ మాస్ నంబర్ ప్రోమోను రేపు (అక్టోబర్ 6) ఉదయం 11:08కి విడుదల చేయనున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ సాంగ్‌ క్లాస్ అండ్ మాస్ కలయికగా ఉండబోతుందని పోస్టర్‌ చూస్తేనే తెలుస్తోంది. రవితేజ, లంగావోణిలో శ్రీలీల డ్యాన్సింగ్‌ మూడ్‌లో కనబడుతున్నారు. 'మాస్ జాతర మాస్ బీట్స్‌.. మెలోడీ ఫీల్‌తో!' అని మేకర్స్ చెప్పడం అభిమానుల్లో ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. ఈ పాటకు మరో స్పెషాలిటీ భీమ్స్ తో కలిసి ఈ పాటను మలయాళీ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ పాడటం.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ‘ధమాకా’ తర్వాత రవితేజ-శ్రీలీల జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో 'మాస్ జాతర'పై అంచనాలు భారీగా ఉన్నాయి.



Tags:    

Similar News