రామ్ 'రెడీ'కి 17 ఏళ్లు

రామ్ నటించిన 'రెడీ' సినిమా తెలుగు సినీ ప్రేమికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ ఫుల్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్‌లో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచింది.;

By :  S D R
Update: 2025-06-19 11:03 GMT

రామ్ నటించిన 'రెడీ' సినిమా తెలుగు సినీ ప్రేమికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ ఫుల్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్‌లో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచింది.శ్రీను వైట్ల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2008, జూన్ 19న ‘రెడీ‘ రిలీజయ్యింది. అంటే ఈరోజుకు ఈ చిత్రం విడుదలై 17 ఏళ్లయ్యింది.

‘దేవదాసు’ (2006)తో హీరోగా పరిచయమైన రామ్ కు ‘రెడీ’తోనే యూత్‌లో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. చందు పాత్రలో రామ్ చూపించిన డ్యాన్స్, ఫైట్స్, కామెడీ టైమింగ్, రొమాంటిక్ లుక్స్ అతన్ని స్టార్ గా స్థిరపరిచాయి. ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. ఆన్ స్క్రీన్ పై రామ్, జెనీలియా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది.

‘రెడీ’ సినిమా పెద్ద విజయం సాధించడం వెనుక ప్రధాన కారణం కామెడీ. శ్రీను వైట్ల మార్క్ కామెడీ ‘రెడీ‘కి పెద్ద ప్లస్ పాయింట్. బ్రహ్మానందం ‘మెక్‌డొనాల్డ్ మూర్తి’గా అదరగొట్టాడు. ఇంకా సునీల్, నాజర్, చంద్రమోహన్, తనికెళ్ల భరణి, కోటా శ్రీనవాసరావు వంటి సీనియర్ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ సినిమా ఆల్బమ్ సూపర్ హిట్.

ఈ మూవీ కమర్షియల్ గా సూపర్ హిట్ కావడమే కాదు అవార్డులలోనూ అదరహో అనిపించింది. పలు భాషల్లో ఈ చిత్రం రీమేక్ అయ్యింది. హిందీలో సల్మాన్ ఖాన్ తో ‘రెడీ‘ పేరుతోనే రీమేక్ అయ్యి అక్కడా భారీ విజయాన్ని సాధించింది.

Tags:    

Similar News