విజయ్ కి విలన్ గా రాజశేఖర్?
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్‘ చిత్రం జూలై 4న విడుదలకు ముస్తాబవుతుంది. ఈ సినిమాతో పాటు విజయ్ కిట్టీలో మరో రెండు చిత్రాలు ఉన్నాయి.;
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్‘ చిత్రం జూలై 4న విడుదలకు ముస్తాబవుతుంది. ఈ సినిమాతో పాటు విజయ్ కిట్టీలో మరో రెండు చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి దిల్ రాజు నిర్మాణంలో రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందే ‘రౌడీ జనార్థన్‘ ఒకటి కాగా.. మైత్రీ మూవీ మేకర్స్ లో రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించే మరొక చిత్రం.
‘రౌడీ జనార్దన్‘ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతుంది. ఈ సినిమాకోసం యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ను విలన్ గా ఆన్ బోర్డులోకి తీసుకుంటున్నారట. చిరంజీవి, బాలకృష్ణలతో పాటు.. దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతున్న వారి లిస్టులో రాజశేఖర్ పేరు కూడా చెప్పాలి.
రాజశేఖర్ విలన్ గా టర్న్ అవ్వబోతున్నాడు? అనే న్యూస్ చాలా రోజులుగా వినిపిస్తుంది. అది ఇప్పుడు ‘రౌడీ జనార్థన్‘తో ఫుల్ ఫిల్ అవ్వబోతుందట. ఇప్పటికే ఈ సినిమాకోసం రాజశేఖర్ ఫోటో షూట్ కూడా చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే.. ‘రౌడీ జనార్థన్‘లో రాజశేఖర్ ఎంట్రీపై క్లారిటీ రానుందట.