ఇండిగో విమానాల్లో వరుస లోపాలు: ప్రయాణికుల్లో భయాందోళన!

తిరుపతి-హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్‌లో 40 నిమిషాల గగనచక్రం తరువాతి ఏర్పాట్లలో ఇండిగో విఫలం – ప్రయాణికుల్లో అసంతృప్తి;

Update: 2025-07-21 09:10 GMT

ఈ మధ్య వరసగా జగుతున్న విమాన ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.నిన్న రాత్రి తిరుపతి నుండి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానం… గగనతలంలో సాంకేతిక లోపంతో విమానం గాల్లోనే దాదాపు 40 నిమిషాలు చక్కర్లు కొట్టింది. ప్రయాణికుల గుండెల్లో భయం, ముఖాల్లో ఆందోళన స్పష్టంగా కనిపించింది.

ఆకస్మికంగా తలెత్తిన సమస్యను అధిగమించలేక పైలట్లు అప్రమత్తం అయ్యి చివరికి తిరిగి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో సురక్షిత ల్యాండింగ్‌ చేసారు. కానీ, తరువాతి ఏర్పాట్లలో ఇండిగో సంస్థ వైఫల్యం ప్రజల్లో అసంతృప్తిని కలిగించింది. ప్రయాణానికి సిద్ధంగా ఉన్న వారు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది.

ఇటీవల కాలంలో విమానాల్లో సంభవిస్తున్న వరుస సాంకేతిక లోపాలు, సంస్థల నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులు విమాన ప్రయాణాల పట్ల భయం చెందుతున్నారు. లాభ నష్టాల లెక్కలతో సాంకేతిక నిపుణులను తక్కువగా నియమించడమే పెద్ద సమస్యగా మారుతోంది.

గత వారమే జులై 16వ తేదీన ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇదే ఇండిగో సంస్థ నుంచి బయలుదేరిన విమానం ఫ్లయిట్ ఇంజన్ సమస్య కారణంతో పైలట్స్ అప్రమత్తం అయ్యి అత్యవసరంగా ముంబై ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ చేసారు.191 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

విమాన సర్వీసుల నిర్వహణలో కనీస ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలను తక్కువగా అంచనా వేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న విమాన సంస్థల వైఖరి తక్షణమే మారకపోతే, దీనివల్ల భయంకరమైన ఘటనలు చోటు చేసుకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


Tags:    

Similar News