ఆఫ్రికా వెళ్లే ముందు లైసెన్స్ రెడీ!
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న SSMB29 ఫారెన్ షెడ్యూల్ షూట్ కి రెడీ అవుతుంది.;
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న SSMB29 ఫారెన్ షెడ్యూల్ షూట్ కి రెడీ అవుతుంది. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశాలలో కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలో ఆఫ్రికాలో షూటింగ్ జరుపుకోనుందట.
ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా విదేశాల్లో చిత్రీకరణ జరగనున్న నేపథ్యంలో, అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం ఏర్పడింది. దీంతో రాజమౌళి తన లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకునేందుకు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని సందర్శించాడు.
రాజమౌళి కార్యాలయానికి చేరుకున్న తర్వాత, రెన్యువల్ ప్రక్రియలో భాగంగా అవసరమైన వివరాలను అందించాడు. ఆయన ఫొటో తీయించుకుని, సంతకం చేసిన అనంతరం అధికారులు కొత్త అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను జారీ చేశారు. ఈ ప్రక్రియ సాఫీగా పూర్తవడంతో, రాజమౌళి తన విదేశీ షూటింగ్ షెడ్యూల్ కోసం సన్నద్ధమయ్యాడు.