ప్రభాస్ బర్త్ డే స్పెషల్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డేకి మరొక వారం రోజులు మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో రెబెల్ స్టార్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్స్ రెడీ అవుతున్నాయి.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డేకి మరొక వారం రోజులు మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో రెబెల్ స్టార్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్స్ రెడీ అవుతున్నాయి. ప్రభాస్ నటించిన పాత సినిమాలను రీ రిలీజ్ రూపంలో ప్రేక్షకులకు అందించేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది ‘సలార్‘.
‘బాహుబలి‘ సిరీస్ తర్వాత రెబెల్ స్టార్ ప్రభాస్ కు మళ్లీ గ్రేట్ కమ్ బ్యాక్ గా నిలిచింది ‘సలార్‘. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ అండ్ వైలెన్స్ మూవీ ప్రభాస్ కెరీర్లో ఒన్ ఆఫ్ ది రికార్డు గ్రాసర్ గా నిలిచింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ గా రూ.700 కోట్లు కొల్లగొట్టింది. ఓటీటీలోనూ రికార్డు స్థాయి వ్యూస్ సాధించింది.
ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా అక్టోబర్ 23న ‘సలార్‘ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ‘సలార్‘ ఫస్ట్ పార్ట్ షూటింగ్ సమయంలోనే సెకండ్ పార్ట్ షూటింగ్ కొంత మేరకు పూర్తి చేశారు. కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ ‘డ్రాగన్‘తో బిజీ ఉండటంతో ‘సలార్ 2‘ పట్టాలెక్కడానికి మరికాస్త సమయం పడుతుంది.
మరోవైపు.. ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా ‘పౌర్ణమి‘ కూడా రీ రిలీజవుతుంది. ఎమ్.ఎస్.రాజు నిర్మాణంలో ప్రభుదేవా తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా త్రిష, ఛార్మీ నటించారు. ‘పౌర్ణమి‘ సినిమా అక్టోబర్ 23న మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. ప్రభాస్ బర్త్ డే రోజున కాకపోయినా.. వారం ఆలస్యంగా థియేటర్లలోకి వస్తోంది ‘బాహుబలి.. ది ఎపిక్‘. ‘బాహుబలి‘ సిరీస్ రెండు భాగాలను కలిపి ఒకే పార్ట్ గా అందించబోతున్న చిత్రమిది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి‘ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా పలు స్క్రీన్స్ లో అక్టోబర్ 31న రిలీజ్ కు రెడీ అవుతుంది.