'పెద్ది' పాట మరోసారి వాయిదా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.;
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ సినిమా నుంచి దసరా కానుకగా ఫస్ట్ సింగిల్ వస్తుందని ప్రకటించారు. అయితే.. ఆ తర్వాత అది దీపావళికి షిప్ట్ అయ్యింది.
ఇప్పుడు దీపావళికి కూడా 'పెద్ది' ఫస్ట్ సింగిల్ రావడం లేదట. ఇటీవల 'పెద్ది' సినిమాలోని ఓ పాటను పూణెలో చిత్రీకరించారు. ఆ పాటనే ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే.. సాంగ్ రిలీజ్ విషయంలో ప్లాన్ మార్చుకుందట టీమ్. నవంబర్ 8న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఏఆర్ రెహమాన్ లైవ్ కన్సర్ట్ లో ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ ను వేలాది మంది అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా లాంచ్ చేయాలనుకోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది.
ఇక వచ్చే ఏడాది మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ గా ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.