‘దేవర’ రికార్డును బద్దలు కొట్టిన ‘పెద్ది’

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే ఈ గ్లింప్స్ 36.5 మిలియన్ల వ్యూస్ సాధించి, యూట్యూబ్‌లో నంబర్ వన్ లో ట్రెండ్ అవుతుంది.;

By :  S D R
Update: 2025-04-07 13:21 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే ఈ గ్లింప్స్ 36.5 మిలియన్ల వ్యూస్ సాధించి, యూట్యూబ్‌లో నంబర్ వన్ లో ట్రెండ్ అవుతుంది. అంతేకాకుండా, తెలుగు సినిమాలలో గ్లింప్స్ పరంగా ఒక రోజు వ్యవధిలోనే అత్యధిక వ్యూస్ సాధించిన వీడియోగా ఇది రికార్డును నెలకొల్పింది.

ఇంతకు ముందు ఈ రికార్డు ఎన్టీఆర్ ‘దేవర’ గ్లింప్స్‌ (26.17 మిలియన్లు) పేరిట ఉంది. కానీ 'పెద్ది' మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ ఆ రికార్డును కేవలం 18 గంటల్లోనే అధిగమించింది. వ్యూస్ విషయంలో ముందంజ వేసినా, లైక్స్ పరంగా మాత్రం 'దేవర'దే ఆధిక్యం. దేవర గ్లింప్స్‌కి 7 లక్షలకు పైగా లైక్స్ రావగా, 'పెద్ది' గ్లింప్స్ 4 లక్షల మార్క్‌ను క్రాస్ చేసింది.

'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. శివరాజ్ కుమార్, దివ్యేందు, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చరణ్ బర్త్ డే స్పెషల్ గా వచ్చే ఏడాది మార్చి 27న 'పెద్ది' గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.



Tags:    

Similar News