పవన్ గురువు హుస్సైనీ కన్నుమూత

ప్రముఖ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ శిక్షకుడు షిహాన్ హుస్సైనీ బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ చెన్నైలో కన్నుమూశారు. భారతీయ కరాటే రంగంలో విశేష కీర్తి సాధించిన ఆయన, ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శకుడిగా నిలిచారు.;

By :  S D R
Update: 2025-03-25 06:53 GMT

ప్రముఖ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ శిక్షకుడు షిహాన్ హుస్సైనీ బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ చెన్నైలో కన్నుమూశారు. భారతీయ కరాటే రంగంలో విశేష కీర్తి సాధించిన ఆయన, ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శకుడిగా నిలిచారు.

హుస్సైనీ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన దగ్గరే కరాటే శిక్షణ తీసుకున్న పవన్ కళ్యాణ్, తన అనుభవాలను ప్రస్తావిస్తూ, హుస్సైనీ గారు కఠిన నియమాలతో శిక్షణ అందించారని, తొలుత తనకు కరాటే నేర్పేందుకు సుముఖంగా లేకపోయినా, చివరకు ఒప్పుకుని శిక్షణ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ‘తమ్ముడు‘ సినిమాలో తన పాత్రకు కావాల్సిన కిక్ బాక్సింగ్ సాధనలో ఆయన శిక్షణ ఎంతో ఉపయోగపడిందని తెలిపారు.

మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీతోపాటు సంగీతం, చిత్రకళ, శిల్పకళల్లోనూ నైపుణ్యం ఉన్న హుస్సైనీ, తమిళనాడులో ఆర్చరీ ప్రాచుర్యం కల్పించేందుకు విశేషంగా కృషి చేశారు. మరణానంతరం తన దేహాన్ని మెడికల్ కాలేజీకి అందజేయాలని నిర్ణయించుకోవడం, ఆయన ఆలోచనా స్థాయిని ప్రతిబింబిస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. హుస్సైనీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

Tags:    

Similar News