'వీరమల్లు' కోసం పవన్ ప్రమోషన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హరి హర వీరమల్లు' జూన్ 12 గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఎ.ఎమ్.రత్నం నిర్మాణంలో జ్యోతికృష్ణ, క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హరి హర వీరమల్లు' జూన్ 12 గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఎ.ఎమ్.రత్నం నిర్మాణంలో జ్యోతికృష్ణ, క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నిర్మాత ఎ.ఎమ్.రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్ వరుస ఇంటర్యూలు ఇస్తున్నారు. అయితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రచారానికి ఎప్పుడు వస్తాడు? అనేదే ప్రశ్న.
ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ వారం చివరి నుంచి పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ లో పాల్గొంటాడట. అయితే రెగ్యులర్ ప్రమోషన్లలా కాకుండా ప్రత్యేక ఇంటర్వ్యూల రూపంలో సినిమా గురించి మాట్లాడనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ వారం నుంచే మేకర్స్ ప్రమోషన్లలో మరింత జోరు పెంచబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, టీజర్ రాగా.. ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తంగా పవన్ కళ్యాణ్ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ 'హరిహర వీరమల్లు' ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.