పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ క్రేజ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న చిత్రాలలో 'ఓజీ' ఒకటి. 'సాహో' ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న చిత్రాలలో 'ఓజీ' ఒకటి. 'సాహో' ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టే ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఆల్రెడీ షూటింగ్ పూర్తిచేసుకున్న 'ఓజీ' మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజులో జరుగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఉంది. ఒక్క ఆంధ్ర ఏరియాలోనే ఈ చిత్రం రూ.80 కోట్లకు పైగా అమ్ముడవ్వడం విశేషం. ఇక సీడెడ్ (రాయలసీమ) రైట్స్ ను ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ తీసుకోవడం విశేషం.
ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. పవర్ స్టార్ కి 'భీమ్లా నాయక్, వకీల్ సాబ్, బ్రో' వంటి వరుస సినిమాలకు సంగీతాన్ని సమకూర్చాడు తమన్. 'ఓజీ' కోసం తమన్ ఓ రేంజులో మ్యూజిక్, బి.జి.ఎమ్. అందిస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇప్పటికే ఈ మూవీలో తమిళ నటుడు శింబు ఒక పాడాడు. ఈ పాటను త్వరలోనే ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేయబోతున్నారు. డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ పై దానయ్య నిర్మిస్తున్న 'ఓజీ' చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదలకు ముస్తాబవుతుంది.