‘కన్నప్ప’ విడుదల వాయిదా

పాన్‌-ఇండియా స్థాయిలో రూపొందుతున్న మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ 25న విడుదలకావాల్సిన ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు హీరో కమ్ ప్రొడ్యూసర్ విష్ణు.;

By :  S D R
Update: 2025-03-29 13:29 GMT

పాన్‌-ఇండియా స్థాయిలో రూపొందుతున్న మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ 25న విడుదలకావాల్సిన ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు హీరో కమ్ ప్రొడ్యూసర్ విష్ణు.

‘కన్నప్ప‘ వాయిదా విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు విష్ణు. ‘కన్నప్ప కథను అత్యున్నత స్థాయిలో రూపొందించేందుకు మేము శ్రమిస్తున్నాం. ముఖ్యమైన విజువల్ ఎఫెక్ట్స్ భాగం ఇంకా పూర్తికాలేదు. అందుకే సినిమాను నిర్దేశిత సమయానికి విడుదల చేయలేకపోతున్నాం. ప్రేక్షకుల సహనానికి కృతజ్ఞతలు. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అని విష్ణు పేర్కొన్నాడు.

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ మైథలాజికల్ మూవీ తెరకెక్కుతుంది.

Tags:    

Similar News