హిస్టారిక్ ఎపిక్ లో గోపీచంద్
మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. వీటిలో ఒకటి ‘ఘాజీ‘ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో కాగా.. మరొకటి కొత్త దర్శకుడు కుమార్ వెల్లంకి డైరెక్షన్ లో చేస్తున్నాడు.;
మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. వీటిలో ఒకటి ‘ఘాజీ‘ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో కాగా.. మరొకటి కొత్త దర్శకుడు కుమార్ వెల్లంకి డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈరోజు (జూన్ 12) గోపీచంద్ బర్త్ డే స్పెషల్ గా సంకల్ప్ రెడ్డి మూవీ గ్లింప్స్ రిలీజయ్యింది.
వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట సంకల్ప్ రెడ్డి. ఇప్పుడు గోపీచంద్ చిత్రాన్నీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఓ వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమాని హిస్టారిక్ ఎపిక్ గా తీర్చిదిద్దుతున్నామని మేకర్స్ ప్రకటించారు. ఈరోజు గోపీచంద్ బర్త్ డే స్పెషల్ గా ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో గుబురు గడ్డంతో ఓ యోధుడిగా కనిపిస్తున్నాడు గోపీచంద్. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.