సినిమా ప్రతినిధుల సమావేశం వాయిదా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలుగు సినిమా పరిశ్రమ ప్రతినిధులు జరపాలనుకున్న కీలక సమావేశం వాయిదా పడింది.;

By :  S D R
Update: 2025-06-15 01:43 GMT
సినిమా ప్రతినిధుల సమావేశం వాయిదా
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలుగు సినిమా పరిశ్రమ ప్రతినిధులు జరపాలనుకున్న కీలక సమావేశం వాయిదా పడింది. ఈ రోజు (జూన్ 15) సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జరగాల్సిన ఈ భేటీలో నిర్మాతలు, దర్శకులు, నటులు పాల్గొనాల్సి ఉంది.

అయితే.. సమావేశానికి హాజరు కావలసిన సినిమా పరిశ్రమలోని ముఖ్య వ్యక్తులు ఎక్కువ మంది ప్రస్తుతం వివిధ షూటింగ్ షెడ్యూళ్ల కారణంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. వారు అందుబాటు లేకపోవడం ఈ భేటీ వాయిదాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన, సాంకేతిక అంశాలకు సంబంధించిన అంశాలను ఈ సమావేశంలో చర్చించాల్సి ఉంది. త్వరలో ఈ సమావేశానికి సంబంధించి కొత్త తేదీని నిర్ణయించనున్నారు.

Tags:    

Similar News