ఏపీలో స్పేస్ పాలసీకి ఆమోదం - అంతరిక్షంలో ఆంధ్రప్రదేశ్

స్పేస్ రంగాన్ని ఓ కేంద్ర బిందువుగా మార్చే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం - ఏపీలో స్పేస్ పాలసీకి ఆమోదం;

Update: 2025-07-14 12:23 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో అంతరిక్ష రంగ అభివృద్ధికి కీలకంగా వ్యవహరించే స్పేస్ సిటీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం స్పేస్ పాలసీకి ఆమోదం తెలిపి, సంబంధిత అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.

రాబోయే 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం తో పాటు 35,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలను కల్పించడంమే లక్ష్యం గా స్పేస్ రంగానికి అనుకూలమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది అని తెలియచేసింది ఏపీ గవర్నమెంట్.

స్పైస్ పాలసీ ఏర్పాట్లలో భాగంగా అంతర్జాతీయ, జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పరచడం మరియు పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, శిక్షణా కేంద్రాల ఏర్పాటు చేయడం జరుగుతుంది.

స్పైస్ పాలసీ నిర్మాణానికి ఏపీ లోని శ్రీ సత్యసాయి జిల్లా – లేపాక్షి మరియు తిరుపతి జిల్లా – సురమాలలో ఏర్పాటు చేయడానికీ ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఇది కేవలం పెట్టుబడులే కాకుండా, సాంకేతికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు, యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కీలకంగా మారబోతోందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.

రాష్ట్రం స్పేస్ రంగంలో కీలక హబ్‌గా మారేందుకు ఈ విధానంతో దృఢంగా అడుగులు వేస్తోందని ప్రభుత్వం ప్రకటించింది.

Tags:    

Similar News