‘కుబేర‘ కోసం అమెజాన్ కండిషన్!

ఈనెలలో థియేటర్లలోకి రానున్న చిత్రాలలో ‘కుబేర‘ ఒకటి. నాగార్జున, ధనుష్ కలయికలో మల్టీస్టారర్ గా శేఖర్ కమ్ముల ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటించింది.;

By :  S D R
Update: 2025-06-09 12:58 GMT

ఈనెలలో థియేటర్లలోకి రానున్న చిత్రాలలో ‘కుబేర‘ ఒకటి. నాగార్జున, ధనుష్ కలయికలో మల్టీస్టారర్ గా శేఖర్ కమ్ముల ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటించింది. జూన్ 20న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా ‘కుబేర‘ ఓటీటీ డీల్ గురించి నిర్మాత సునీల్ నారంగ్ చేసిన వ్యాఖ్యలు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.

సినిమాకు సంబంధించిన కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా మిగిలి ఉన్నప్పటికీ, ఓటీటీ డీల్‌ కారణంగా విడుదల తేదీ వాయిదా వేయలేని పరిస్థితి నెలకొందని సునీల్ తెలిపారు. అమెజాన్ ప్రైమ్ తో ముందుగానే ఓటీటీ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల, జూన్ 20కు మించి విడుదల చేస్తే రూ.10 కోట్లు తగ్గించేస్తామని ప్రైమ్ వార్నింగ్ ఇచ్చిందని ఆయన చెప్పారు. దీంతో వాయిదా వేసే ఆలోచన మానేసి, శరవేగంగా విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు సునీల్

నారంగ్.

ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు పాటలు రాగా.. వాటికి మంచి రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్ గా థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్నారు. రేపు (జూన్ 10) ‘పిప్పీ పిప్పీ దమ్ దమ్ దమ్’ అంటూ సాగే గీతం రాబోతుంది. ఈ పాటలో రష్మిక సందడి చేయబోతుంది. ముంబై వేదికగా ఈ పాటను విడుదల చేయబోతున్నారు.

Tags:    

Similar News