పునర్జన్మ కాన్సెప్ట్‌తో బన్నీ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబోలో సినిమాకి సంబంధించి కసరత్తులు వేగవంతంగా సాగుతున్నాయి. ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే స్పెషల్ గా ఈ సినిమాని ప్రకటించే అవకాశం ఉంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందట.;

By :  S D R
Update: 2025-03-29 03:26 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబోలో సినిమాకి సంబంధించి కసరత్తులు వేగవంతంగా సాగుతున్నాయి. ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే స్పెషల్ గా ఈ సినిమాని ప్రకటించే అవకాశం ఉంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందట.

లేటెస్ట్ గా అల్లు అర్జున్-అట్లీ స్టోరీకి సంబంధించి ఆసక్తికర విశేషాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రం పునర్జన్మ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందనుందని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇందులో రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతుండగా, కథ భారీ పీరియాడిక్ డ్రామాగా సాగుతుందట.

హై ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ తో భారీ స్థాయిలో ఆడియన్స్ కు విజువల్ ట్రీట్ అందించేలా ఈ మూవీని డిజైన్ చేస్తున్నాడట అట్లీ. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తైన ఈ మూవీ కోసం లొకేషన్స్ హంటింగ్, సెట్స్ డిజైనింగ్ వంటి వర్క్స్ కూడా సైలెంట్ గా పూర్తవుతున్నాయట. జూలై నంచి ఈ సినిమా షూటింగ్ కానున్నట్టు తెలుస్తోంది.

'పుష్ప 2' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత అల్లు అర్జున్.. 'జవాన్' వంటి వెయ్యి కోట్లు సినిమా తర్వాత అట్లీ కలయికలో రూపొందనున్న ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా అల్లు అర్జున్-అట్లీ తమ ప్రీవియస్ ఫిల్మ్స్‌కు మించిన రీతిలో ఆడియన్స్ కు విజువల్ ట్రీట్ అందించేందుకు ఈ ప్రాజెక్ట్‌తో రెడీ అవుతున్నారట.

Tags:    

Similar News