ఊర్వశి రౌతేలా వింత కోరిక

తెలుగులో స్పెషల్ నంబర్స్ కి కేరాఫ్ అడ్రస్ ఊర్వశి రౌతేలా. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ లతో మాస్ డ్యాన్సులతో మెస్మరైజ్ చేసింది.;

By :  S D R
Update: 2025-04-18 09:05 GMT

తెలుగులో స్పెషల్ నంబర్స్ కి కేరాఫ్ అడ్రస్ ఊర్వశి రౌతేలా. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ లతో మాస్ డ్యాన్సులతో మెస్మరైజ్ చేసింది. ‘డాకు మహారాజ్‘లో అయితే పోలీస్ క్యారెక్టర్ లో కనిపిస్తూనే ‘దబిడి దిబిడి‘ అంటూ పాటలో రెచ్చిపోయింది. లేటెస్ట్ గా రిలీజైన సన్నీ డియోల్ ‘జాట్‘లోనూ ప్రత్యేక గీతంలో అలరించింది.

తాజాగా ఊర్వశి రౌతేలా తనకు సౌత్ లో గుడి కట్టాలి అంటూ మాట్లాడిన ఓ ఇంటర్యూ వీడియో ఒకటి నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతుంది. నార్త్ లో బద్రీనాథ్ పక్కన ‘ఊర్వశి‘ అన్న పేరుతో టెంపుల్ ఉందని.. సౌత్ లో కూడా తాను చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర కథానాయకులతో నటించానని.. దక్షిణాదిన కూడా తనకు గుడి కడితే బాగుంటుందనే వింత కోరికను ఈ వీడియోలో బయట పెట్టింది ఊర్వశి.

అయితే ఊర్వశి సరదాగానే ఈ విషయాన్ని అన్నదా? లేక సీరియస్ గానే తనకు గుడి కట్టాలని చెప్పిందా? అనే దానిపై క్లారిటీ లేదు. మొత్తంగా.. సౌత్ లో హీరోయిన్స్ కు టెంపుల్స్ కట్టే సంస్కృతి తమిళనాడులో ఉంది. గతంలో ఖుష్బూ, హన్సిక వంటి హీరోయిన్స్ కు ఫ్యాన్స్ గుడిలు కట్టారు.



Tags:    

Similar News