పులి పిల్లకి క్లీంకార పేరు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతుల కుమార్తె క్లీంకార ఈరోజు (జూన్ 20న) రెండో పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ ప్రత్యేకమైన రోజును వారు ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకున్నారు.;
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతుల కుమార్తె క్లీంకార ఈరోజు (జూన్ 20న) రెండో పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ ప్రత్యేకమైన రోజును వారు ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకున్నారు.
గతేడాది చరణ్ కుటుంబం హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌ను సందర్శించగా, అక్కడ ఓ తెల్ల పులి పిల్ల వారిని ఆకర్షించింది. వారికున్న జంతుప్రేమను గుర్తించిన జూ అధికారులు ఆ పులి పిల్లకు 'క్లీంకార' అనే పేరు పెట్టారు. ఇప్పుడు ఏడాది తర్వాత, అదే పులిని చిన్నారి క్లీంకార ప్రత్యక్షంగా చూసిన సంధర్భం హృద్యంగా మారింది.
ఈ ఏడాది క్లీంకార పుట్టినరోజు సందర్భంగా ఉపాసన – క్లీంకారతో కలిసి జూపార్కును తిరిగి సందర్శించి, ఆ తెల్లపులిని అధికారికంగా దత్తత తీసుకున్నారు. పులి ఎదుగుదలపై మమకారం వ్యక్తం చేస్తూ, వన్యప్రాణుల సంరక్షణకు తమ మద్దతు తెలియజేశారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న ఉపాసన తన పోస్ట్‌లో ‘ఏడాది క్రితం అది ఒక పసికూన, నేడు శివంగిలా మారింది. ఇప్పుడు అది మా క్లీంకారతో తన పేరును పంచుకుంటోంది‘ అంటూ హృద్యంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోలో క్లీంకార ఫేస్ కొంతవరకు రివీల్ కావడంతో, మెగా అభిమానులు చరణ్ తనయ ‘ఎంత క్యూట్‌గా ఉందో’ అంటూ ఫిదా అవుతున్నారు.