శ్రీలీల హల్దీ ఫోటోలు వైరల్?
క్రేజీ బ్యూటీ శ్రీలీల గురించి ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. శ్రీలీల తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఆమె ఎంగేజ్మెంట్ గురించి ఊహాగానాలకు తెరలేపాయి.;
క్రేజీ బ్యూటీ శ్రీలీల గురించి ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. శ్రీలీల తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఆమె ఎంగేజ్మెంట్ గురించి ఊహాగానాలకు తెరలేపాయి. ‘బిగ్ డే, కమింగ్ సూన్‘ అంటూ ఆమె ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసిన ఈ ఫోటోల్లో హల్దీ వేడుకల్లో శ్రీలీల కనిపిస్తుంది.
ఈ ఫోటోలలో ఆమె సంప్రదాయ దుస్తుల్లో, హల్దీతో అలంకరించబడి, ఆనందంగా కనిపించడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. దీంతో.. ‘శ్రీలీల నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకుందా?‘ అనే కామెంట్స్ జోరందుకున్నాయి.
కొందరు ఇది ఆమె వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన అని భావిస్తుండగా, మరికొందరు ఇది ఏదో సినిమా షూటింగ్లో భాగమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు తెలుగులో ‘ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ జాతర‘ వంటి పలు సినిమాలను లైన్లో పెట్టిన శ్రీలీల.. తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టింది.