రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు ఇంట్లోకి ఎంట్రీ!
టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్, అతని మాజీ ప్రేయసి లావణ్య మధ్య కొనసాగుతున్న వివాదం మరోసారి వార్తలల్లోకి వచ్చింది.;
టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్, అతని మాజీ ప్రేయసి లావణ్య మధ్య కొనసాగుతున్న వివాదం మరోసారి వార్తలల్లోకి వచ్చింది. ఇటీవల లావణ్య.. రాజ్ తరుణ్‌పై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించినా, ఈ వివాదం అంతటితో ఆగలేదు. తాజాగా ఈ వివాదం ఊహించని మలుపు తిరిగింది.
తాజాగా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బస్వరాజ్, రాజేశ్వరి దంపతులు లావణ్య నివాసం ఉన్న కోకాపేటకు చేరుకుని, ఆ ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే లావణ్య కోర్టు కేసు నడుస్తోంది అంటూ వారిని లోపలికి అనుమతించలేదు. దాంతో వారు ఇంటి బయటే నిరసనకు దిగారు. ఇది మా కుమారుడు తన కష్టంతో కట్టుకున్న ఇల్లు అని వారు వాదిస్తున్నారు. 'సొంత ఇల్లు ఉండి కూడా మేము అద్దె ఇంట్లో ఉండాల్సి వస్తోంది' అని ఆవేదన వ్యక్తం చేశారు.
లావణ్య మాట్లాడుతూ, 'రాజ్ తల్లిదండ్రులు దాదాపు 15 మందిని తీసుకొచ్చారు. నన్ను జుట్టు పట్టుకుని బయటకు లాగారు, మా ఇంటి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు, మా తమ్ముడిపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశారు. ఇది రాజ్ తరుణ్ ప్రోద్బలంతో జరిగింది' అంటూ ఆరోపణలు గుప్పించారు. అలాగే, 'ఈ ఇల్లు నాకు కావాలి. నేను 15 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాను. ఇకపై రాజ్‌ను వదిలిపెట్టను' అని స్పష్టం చేశారు.
ఈ ఉద్రిక్తతపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకున్నారు. చివరికి పోలీసుల సూచనతో లావణ్య.. రాజ్‌తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లోకి అనుమతించారు.
ఇంటిలోకి వెళ్లిన తర్వాత బస్వరాజ్, రాజేశ్వరి మీడియాతో మాట్లాడుతూ, 'లావణ్య మా కోడలు కాదు. మా కుమారుడు ఆమెను పెళ్లి చేసుకోలేదు. సహజీవనం మాత్రమే చేశాడు. అందుకే ఆమెను కోడలిగా అంగీకరించం' అని తేల్చి చెప్పారు. ఈ వివాదం మరోసారి టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. మొదట సద్దుమణిగిందనుకున్న సమస్య ఇప్పుడు మరింత ఉద్రిక్తతకు దారితీస్తోంది.