‘మీసాల పిల్ల‘ మెగా సెన్సేషన్!
మెగాస్టార్ చిరంజీవి – నయనతార జంటగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు‘.;
మెగాస్టార్ చిరంజీవి – నయనతార జంటగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు‘. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ సోషల్ మీడియాలో తుపాను సృష్టిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే యూట్యూబ్ మ్యూజిక్ ట్రెండ్స్‌లో ఇండియా నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. దీన్ని బట్టే ఈ సాంగ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.
భీమ్స్ సిసిరోలియో అందించిన మెలోడీ ట్యూన్, భాస్కరభట్ల రాసిన సాహిత్యం, ఉదిత్ నారాయణ్ – శ్వేతా మోహన్ వాయిస్ మ్యాజిక్ కలిసి ఈ పాటను చార్ట్‌బస్టర్‌గా నిలిపాయి. చిరంజీవి స్టైల్, ఎనర్జీ, డ్యాన్స్ స్టెప్స్ అభిమానుల హృదయాల్లో పండుగ వాతావరణాన్ని తెచ్చేశాయి. షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.