సినీ ఇండస్ట్రీలో రాజకీయం
ప్రముఖ నటి గౌతమి ఇటీవల తమిళ సినిమా పరిశ్రమలో DMK ఆధిపత్యం గురించి తీవ్రంగా విమర్శించారు. DMK మరియు ఆ పార్టీ కుటుంబ అనుబంధ సంస్థలు ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, థియేటర్స్ బుకింగ్స్ వంటి కీలక రంగాలను నియంత్రిస్తున్నాయని తీవ్రంగా వ్యాఖ్యానించారు.;
ప్రముఖ నటి గౌతమి ఇటీవల తమిళ సినిమా పరిశ్రమలో DMK ఆధిపత్యం గురించి తీవ్రంగా విమర్శించారు. DMK మరియు ఆ పార్టీ కుటుంబ అనుబంధ సంస్థలు ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, థియేటర్స్ బుకింగ్స్ వంటి కీలక రంగాలను నియంత్రిస్తున్నాయని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ నియంత్రణ కారణంగా ఇండస్ట్రీలో క్రియేటివిటీ దెబ్బతింటుందని, కొత్త వారికి ప్రోత్సాహం కరువవుతుందని ఆమె తెలిపారు.
DMK అనుబంధ కంపెనీలు స్టార్ హీరోలతో ప్రత్యేక డీల్స్ చేస్తూ ఇతర చిత్రాల అవకాశాలను తగ్గిస్తున్నాయి. డిస్ట్రిబ్యూషన్ మరియు థియేటర్ నెట్‌వర్క్‌లపై DMK ప్రభావం ఉండటం వల్ల, చిన్న, మీడియం రేంజ్ మూవీస్ కి ఆదరణ దక్కుతుందని ఆమె అన్నారు.
అయితే గౌతమి విమర్శలు రాజకీయాల నేపథ్యంగానే చూడాలనే వారూ ఉన్నారు. 2024లో BJP ను విడిచిన ఆమె తర్వాత AIADMK లో చేరి, డిప్యూటీ ప్రపగండా సెక్రటరీగా నియమితులయ్యారు. ఈనేపథ్యంలోనే DMK పై ఆమె తన విమర్శలను మరింత బలపరిచారు. మరోవైపు.. తమిళనాడు సినీ పరిశ్రమ అంతా డీఎంకే కోసం పనిచేస్తుంది, మద్దతుగా ఉంది అనేది ఎంత నిజమో.. తెలుగు చిత్ర పరిశ్రమ కూడా 80% టిడిపి కోసం 20% జనసేన కోసం పనిచేస్తుంది ఇందులో ఆశ్చర్యం ఏముంది అంటున్నారు ఇక్కడ విశ్లేషకులు.