తొలిసారిగా స్కూబా డైవింగ్ చేసిన కీర్తి సురేష్
కొంతమంది జ్ఞాపకాలను సముద్రపు చిప్పల్లా సేకరిస్తారు. అలాంటి ఓ విలువైన జ్ఞాపకాన్ని సముద్ర తీరం నుంచి సొంతం చేసుకుంది మహానటి కీర్తి సురేష్.;
కొంతమంది జ్ఞాపకాలను సముద్రపు చిప్పల్లా సేకరిస్తారు. అలాంటి ఓ విలువైన జ్ఞాపకాన్ని సముద్ర తీరం నుంచి సొంతం చేసుకుంది మహానటి కీర్తి సురేష్. రీసెంట్ గా ఆంటోని తట్టిల్ ను పెళ్లి చేసుకున్న తర్వాత వేసవి సెలవుల్లోకి అడుగుపెట్టిన కీర్తి, తన జీవితంలో తొలిసారి స్కూబా డైవింగ్ చేసి ప్రత్యేక అనుభూతిని పొందింది.
స్కూబా డైవింగ్ చేసిన అనంతరం, ఒక కోరల్‌ను చేతిలో పట్టుకొని కనిపించిన కీర్తి, “అద్భుతమైన స్కూబా డైవ్ తర్వాత నువ్వే నీ బహుమతిని ఎంచుకోవడం. దీనికి మించిన ఫీలింగ్ ఉండదు..” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె గ్రీన్ కలర్ స్లీవ్‌లెస్ టాప్, మ్యాచ్ అయ్యే స్కర్ట్ ధరించి బీచ్‌లో నిలబడిన ఫోటోలు పంచుకుంది. కెమెరాల లైట్స్ లో తరచూ కనిపించే ఆమె నుంచి ఇలా సహజమైన, నిగూఢమైన ఆనందాన్ని పంచుకోవడం అభిమానులను ఆకట్టుకుంది.
ఈ ప్రశాంతమైన విహారం తర్వాత ఆమె తిరిగి బిజీ షెడ్యూల్‌లోకి అడుగుపెట్టబోతోంది. త్వరలోనే ఆమె నటించిన కొన్ని తమిళ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా అధికారికంగా టైటిళ్లు వెల్లడించకపోయినా, కీర్తి అభిమానులకు కొత్త కధలతో పాటు బలమైన పాత్రలు గల చిత్రాలు ఈ ఏడాది రాబోతు న్నాయని చెప్పవచ్చు. ఇది కీర్తి జీవితంలో ప్రేమ, ప్రయాణం, నటనతో నిండిన ఒక కొత్త అధ్యాయం మొదలైనట్లు కనిపిస్తోంది.