కమల్ వ్యాఖ్య.. శివన్నపై విమర్శలు!
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో జూన్ 5న విడుదల కానున్న కమల్ హాసన్ చిత్రం 'థగ్ లైఫ్' అనుకోని వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలసిందే. కర్ణాటకలో జరిగిన ప్రమోషన్స్ లో తమిళం నుంచి కన్నడం పుట్టిందని కమల్ హాసన్ అన్న మాట కలకలం రేపింది.;
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో జూన్ 5న విడుదల కానున్న కమల్ హాసన్ చిత్రం 'థగ్ లైఫ్' అనుకోని వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలసిందే. కర్ణాటకలో జరిగిన ప్రమోషన్స్ లో తమిళం నుంచి కన్నడం పుట్టిందని కమల్ హాసన్ అన్న మాట కలకలం రేపింది. తమిళనాడులో దీనిని గర్వంగా చూసినా, కర్ణాటకలో మాత్రం ఆవేదనగా తీసుకున్నారు. ఇది ఊహించని దిశగా వెళ్లింది.
కమల్ తన వ్యాఖ్యపై అడిగితే 'నిజమే అన్నాను, సారీ ఎందుకు చెప్పాలి?' అనే ధోరణి ఆయన కొనసాగించారు. ఈ వ్యవహారంలో అనుకోకుండా బలైపోయిన వ్యక్తి శివరాజ్ కుమార్. 'థగ్ లైఫ్' ఈవెంట్లో కమల్ ప్రసంగానికి చప్పట్లు కొట్టిన శివన్న వీడియోలు యాంటీ ఫ్యాన్స్ చేత వైరల్ అవుతున్నాయి. దీంతో 'కన్నడ గౌరవాన్ని తాకట్టు పెట్టారా?' అనే విమర్శలు ఆయనపై వస్తున్నాయి.
వీటిపై శివరాజ్ కుమార్ స్పందిస్తూ.. తాను అన్ని భాషలను గౌరవిస్తానని, కానీ తనకు కన్నడే మాతృభాష అని తేల్చేశారు. 'నాపై ఎవరైనా కావాలని బురదజల్లితే, బాధ్యతగా నేను క్షమాపణ అడగాలా?' అనే ప్రశ్నతో శివన్న ఓపిక కోల్పోయినట్టు కనిపించారు.
కర్ణాటక ఫిలిం ఛాంబర్, పలువురు రాజకీయ నాయకులు 'థగ్ లైఫ్' సినిమా ప్రదర్శనకు వ్యతిరేకంగా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. బుక్ మై షోలో కర్ణాటక టికెట్లు అందుబాటులో లేకపోవడమే దీనికి నిదర్శనం. ఇప్పుడిదంతా వ్యాపారపరంగా పెద్ద నష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.