షూటింగ్ బ్రేక్‌లో ఫ్యామిలీ టైమ్!
ప్రస్తుతం సినిమా అభిమానుల్లో మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’.;
ప్రస్తుతం సినిమా అభిమానుల్లో మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ‘కేజీఎఫ్, సలార్’ లాంటి విజువల్ స్పెక్టాకుల్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, ఇప్పుడు ఎన్టీఆర్ ఎనర్జీతో కలిసి ఇండియన్ స్క్రీన్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.
ఇటీవలే ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు ఎన్టీఆర్. అప్పటి నుంచి నాన్‌స్టాప్‌గా చిత్రీకరణ సాగుతుంది. ఇక షూటింగ్ నుంచి గ్యాప్ దొరికిన తర్వాత ఎన్టీఆర్-నీల్ తమ పార్టనర్స్ తో కలిసి రిలాక్స్ అవుతూ గడిపిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘డ్రాగన్’ వంటి మాస్ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నా, తెర వెనక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇలా తమ కుటుంబాలకు సమయం కేటాయించడం నిజంగా ఇన్‌స్పిరింగ్ అని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్ గా మే 20న స్పెషల్ గ్లింప్స్ రాబోతుంది. ఈ చిత్రం 2026, జూన్ 25న ఆడియన్స్ ముందుకు రానుంది.