విజయ్ దేవరకొండ పై ఫిర్యాదు
మార్చి 26, 2025న జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ గిరిజన సమాజాన్ని అవమానించేలా వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు తెరపైకి వచ్చాయి.;
మార్చి 26, 2025న జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ గిరిజన సమాజాన్ని అవమానించేలా వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ వ్యాఖ్యలు గిరిజనుల గౌరవాన్ని దెబ్బతీసినట్లు భావించిన ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్, సంఘటితంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షుడు కిషన్ రాజ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 30న హైదరాబాద్ ఎస్.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్‌లో విజయ్ దేవరకొండపై అధికారికంగా ఫిర్యాదు దాఖలైంది.
అసోసియేషన్ ప్రకారం, విజయ్ వ్యాఖ్యలు గిరిజనుల సాంస్కృతిక, సామాజిక విలువలను హీనంగా చూపేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారి, గిరిజన సంఘాలు, సామాజిక కార్యకర్తలు, ప్రజల నుండి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. విజయ్ దేవరకొండ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చౌహాన్ డిమాండ్ చేశారు.
పోలీసులకు సంబంధిత సాక్ష్యాలు సమర్పించినట్లు అసోసియేషన్ తెలిపింది. ఎస్.ఆర్. నగర్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది విజయ్‌కు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు గిరిజన సమాజాన్ని సమర్థిస్తున్నారు.