డ్యాన్సుల్లో కుమ్మేసిన విష్ణుప్రియ!
బుల్లితెరపై వ్యాఖ్యాతగా పాపులరైన విష్ణుప్రియ 'బిగ్ బాస్'లో కంటెస్టెంట్ గా మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఇవే కాకుండా అప్పుడప్పుడూ తనలోని డ్యాన్సింగ్ టాలెంట్ ను బయటపెడుతూ ఉంటుంది. గతంలో ‘బిగ్‌బాస్’ ఫేమ్ మానస్ తో కలిసి విష్ణుప్రియ చేసిన ఫోక్ సాంగ్ ‘జరీ జరీ పంచె కట్టి’ యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టించింది. ఈ పాటలో విష్ణుప్రియ, మానస్ వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అయిపోయారు.
తాజాగా మరోసారి తన డ్యాన్సింగ్ టాలెంట్ ను బయట పెట్టింది విష్ణుప్రియ. ఈసారి మరో 'బిగ్‌బాస్' కంటెస్టెంట్ అమర్‌దీప్ తో కలిసి అదరగొట్టింది. 'కు కు కుమారి' అంటూ సాగే ఈ ఫోక్ సాంగ్ శేఖర్ మాస్టర్ నిర్మాణంలో రూపొందింది. మదీన్ ఎస్.కె. కంపోజ్ చేసిన ఈ గీతానికి సాయిప్రసాద్ పూజారి లిరిక్స్ రాయగా సాకేత్ కోమండూరి, స్పూర్తి జితేందర్ ఆలపించారు. సునీల్ సున్నపు కొరియోగ్రఫీలో హై ఎనర్జిటిక్ స్టెప్స్ తో అదరగొట్టారు విష్ణుప్రియ, అమర్ దీప్. విడుదలైన గంటల్లోనే యూట్యూబ్ లో లక్షల్లో వ్యూస్ సంపాదించింది ఈ పాట.