ఎట్టకేలకు ఈ జోడీ పెళ్ళిపీటలెక్కుతోంది !
తాజాగా ఈ పెయిర్ ఈ ఏడాది ఫిబ్రవరి 14, ప్రేమికుల దినోత్సవం నాడు పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించింది.;
2025 బాలీవుడ్ యంగ్ హీరో ప్రతీక్ బబ్బర్, ప్రియా బెనర్జీ జీవితాల్లో అత్యంత ప్రత్యేకమైన సంవత్సరంగా నిలవనుంది. ఈ జంట 2023 నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకుంది. అప్పటి నుంచి తరచూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ తమ అనుబంధాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. తాజాగా ఈ పెయిర్ ఫిబ్రవరి 14, 2025, ప్రేమికుల దినోత్సవం నాడు పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించింది. ప్రతీక్ బబ్బర్, ప్రియా బెనర్జీ వివాహం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రుల సమక్షంలో జరగనుంది.
ఈ పెళ్లి సంప్రదాయ భారతీయ పద్ధతిలో జరిగే అవకాశం ఉంది. ముంబయిలోని బాంద్రాలో ఉన్న ప్రతీక్ ఇంటివద్దే ఈ వేడుక జరుగుతుందని సమాచారం. ప్రతీక్ అండ్ ప్రియా తరచుగా తమ ప్రేమను బహిరంగంగా వ్యక్తపరుస్తూ ఉంటారు. పండుగలు, పుట్టినరోజులు, వార్షికోత్సవాల సందర్భంగా కలిసి ఉన్న ఫోటోలు పోస్ట్ చేస్తూ తమ అనుబంధాన్ని అభిమానులతో పంచుకుంటారు.
గతేడాది నవంబర్ 26న తమ నిశ్చితార్థానికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రియా బెనర్జీ ప్రత్యేకమైన ఫోటోలు షేర్ చేశారు. "ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న మిస్టర్ అండ్ మిసెస్ భవిష్యత్" అంటూ ఒక రింగ్, ఇన్ఫినిటీ ఎమోజీలతో క్యాప్షన్ ఇచ్చారు. నిజానికి గతంలో ప్రతీక్ బబ్బర్ సినీ దర్శకురాలు సంయా సాగర్‌ను వివాహం చేసుకున్నారు. అయితే, ఈ జంట 2023 జనవరిలో విడాకులు తీసుకున్నారు. ప్రతీక్ బబ్బర్ ప్రస్తుతం పలు ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తున్నాడు. అతడి తాజా సినిమా ధూమ్ ధామ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న సికందర్ లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.