యూట్యూబ్ బిగ్ డెసిషన్: జూలై 15 నుంచి ఏఐ కంటెంట్‌కు మానిటైజేషన్ స్టాప్!
కష్టపడి కంటెంట్ సృష్టించే వారి గౌరవం కాపాడుతున్న యూట్యూబ్;
అసలైన, ఒరిజినల్ కంటెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, ప్రపంచపు అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫారమ్ అయిన యూట్యూబ్ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. జూలై 15 నుంచి ఏఐ (AI) ఆధారితంగా రూపొందించిన వీడియోలు, మళ్లీ మళ్లీ ఉపయోగించే (reused) వీడియోలు, లేదా లో ఎఫర్ట్ కంటెంట్‌కు మానిటైజేషన్ ఆపేసేందుకు సిద్ధమవుతోంది.
ఈ కొత్త పాలసీ ప్రకారం, నిజమైన మానవ స్వరం వినిపించే, మూలకల్పితమైన (transformative) కంటెంట్ కలిగి ఉండే వీడియోలకే భవిష్యత్తులో ఆదాయ అవకాశాలు (monetization) అందుబాటులో ఉంటాయి. ఇతరుల కంటెంట్‌ను నకిలీగా, కట్-పేస్ట్ చేసి తయారుచేసిన వీడియోలు ఇకపై ఆదాయం పొందలేవు.
ఇది యూట్యూబ్ తీసుకున్న అద్భుతమైన నిర్ణయం. ప్రస్తుత కాలంలో నిజమైన కృషి చేస్తున్న క్రియేటర్ల కంటెంట్, ఏఐతో తయారవుతున్న అసలు విలువలేని వీడియోల వల్ల ఎలాగో మనుగడ కోల్పోతోంది. అలాంటి పరిస్థితుల్లో యూట్యూబ్ తీసుకున్న ఈ నిర్ణయం ఒరిజినల్ కంటెంట్‌ను రక్షించడంలో గట్టి అడుగు అని చెప్పాలి.
ఇది నిజమైన టాలెంట్‌కు న్యాయం జరిగేలా చేస్తుంది. తమ స్వంత గొంతుతో, తమ కష్టంతో, సృజనాత్మకతతో కంటెంట్ సృష్టిస్తున్నవారికి ఇక నుంచి మంచి కాలం మొదలవుతుంది.
ఈ మార్పులతో యూట్యూబ్‌ను ఒక గుణాత్మకమైన, ఒరిజినల్ కంటెంట్‌కు నిలయంగా మార్చేందుకు అడుగులు వేస్తోంది. ఇది టెక్నాలజీ సహాయంతో అసలైన టాలెంట్ వెలుగులోకి రావడానికి ఓ మార్గం అవుతుంది.