మరికొన్ని పెళ్ళిఫోటోలు షేర్ చేసిన కీర్తి సురేశ్ !

తాజాగా కీర్తి సురేష్ తన పెళ్లి తర్వాత జరిగిన సంబరాలకు సంబంధించిన మరికొన్ని ఫోటోస్ ను షేర్ చేస్తూ, ఇది సంప్రదాయ మలయాళీ శైలిలో జరిగిందని వ్యాఖ్యానించింది.;

By :  K R K
Update: 2025-01-26 01:27 GMT

కీర్తి సురేష్ గత నెలలో గోవాలో తన వివాహ వేడుకను చాలా గ్రాండ్ గా జరుపుకున్న సంగతి తెలిసిందే . ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెళ్లి ఫోటోలను పలు మార్లు అప్‌లోడ్ చేస్తూ అభిమానులతో పంచుకుంది. పెళ్లి జరిగిన ఒక నెల గడిచినా.. ఆమె వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడాన్ని ఆపలేదు.

తాజాగా కీర్తి సురేష్ తన పెళ్లి తర్వాత జరిగిన సంబరాలకు సంబంధించిన మరికొన్ని ఫోటోస్ ను షేర్ చేస్తూ, ఇది సంప్రదాయ మలయాళీ శైలిలో జరిగిందని వ్యాఖ్యానించింది. కీర్తి సురేష్, ఆమె భర్త ఆంటోని తట్టిల్ మలయాళీ వారసత్వం కలిగినవారు కావడంతో.. సంప్రదాయ మలయాళీ శైలిలో ఈ సంబరాలను జరుపుకున్నట్టు ఆమె క్యాప్షన్‌లో రాసింది. పోస్ట్‌ వెడ్డింగ్ వేడుకల ఫోటోలపై అనేక మంది సెలబ్రిటీల నుంచి లైక్‌లు, కామెంట్లు వచ్చాయి.

ఇదిలా ఉండగా.. ఈ నెల చివరలో కీర్తి సురేష్ తన ‘పసుపు తాళి’ ని తీసి.. బంగారు గొలుసు తాళి ధరిస్తుందని తెలుస్తోంది. డిసెంబర్ 12న జరిగిన వివాహం దగ్గర నుంచి ఆమె ఈ పసుపు తాళిని ధరిస్తోంది. ఒక శుభదినాన.. ఆమె బంగారు తాళిని ధరించనుంది.

Tags:    

Similar News