‘ఎల్ 2 : ఎంపురాన్’ రివ్యూ

స్టీఫెన్ నెడుంపల్లి అలియాస్ ఖురేషి అబ్రహం (మోహన్‌లాల్) కథను కొనసాగిస్తూ, ఈసారి మరింత లోతైన రాజకీయ కుట్రలు, అంతర్జాతీయ కుట్రలు, కుటుంబ సంబంధాలు ప్రధానంగా చూపించారు.;

By :  K R K
Update: 2025-03-27 06:55 GMT

చిత్రం: ఎల్ 2: ఎంపురాన్

నటీనటులు: మోహన్‌లాల్, టోవినో థామస్, మంజు వారియర్, పృథ్వీరాజ్ సుకుమార్

విడుదల తేదీ : మార్చ్ 27, 2025

గీతం: దీపక్ దేవ్

సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్

నిర్మాత: ఆంటోనీ పెరుంబవూర్

దర్శకత్వం : పృధ్విరాజ్ సుకుమారన్

2019లో విడుదలైన ‘లూసిఫర్’ చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో.. దాని కొనసాగింపుగా వచ్చిన ‘ఎల్ 2: ఎంపురాన్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టీఫెన్ నెడుంపల్లి అలియాస్ ఖురేషి అబ్రహం (మోహన్‌లాల్) కథను కొనసాగిస్తూ, ఈసారి మరింత లోతైన రాజకీయ కుట్రలు, అంతర్జాతీయ కుట్రలు, కుటుంబ సంబంధాలు ప్రధానంగా చూపించారు. అతని అసలు లక్ష్యం ఏమిటి? నిజంగా అతను ఎవరు? అనే ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ సినిమాలో దొరుకుతుంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఏ రేంజ్ లో ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది అన్న విషయాలు రివ్యూలో చూద్దాం.

కథ:

'ఎంపురాన్‌' కథ 'లూసిఫర్‌'లోని సంఘటనలను కొనసాగిస్తుంది. జతిన్‌ రాందాస్‌ (టొవినో థామస్‌) రాష్ట్ర పాలనను చేపట్టిన తర్వాత, రాజకీయ శక్తులు అతనిపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తాయి. ఈ పరిస్థితుల్లో.. స్టీఫెన్‌ నెడుంపల్లి అలియాస్‌ ఖురేషి అబ్రహం (మోహన్‌లాల్‌) మళ్లీ రంగ ప్రవేశం చేసి.. తన కుటుంబాన్ని రాష్ట్రాన్ని ఎలా రక్షించడానికి ప్రయత్నిస్తాడు అన్నదే మిగతా కథ.

కథా కథనాల విశ్లేషణ:

సినిమా ఓపెనింగ్‌లోనే ఒక స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్‌తో స్టీఫెన్ ఎక్కడున్నాడో, ఆయన వ్యూహం ఏమిటో క్లూ ఇస్తారు. మోరాకో, దుబాయ్ వంటి లొకేషన్లలో ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో కథ నడుస్తుంది. పృథ్వీరాజ్ స్క్రీన్‌ప్లే.. కథను మొదటి 30 నిమిషాల్లోనే ఉత్కంఠభరితంగా మార్చేస్తుంది.

కథ కాస్త మెల్లగా సాగినా.. ప్రధాన పాత్రల అభివృద్ధి, వారి ఆంతరంగిక దృక్కోణాలను స్పష్టంగా చూపిస్తుంది. టోవినో థామస్ (జతిన్ రాందాస్) పాత్ర రాజకీయ ఒత్తిడులతో ఎలా పోరాడుతున్నాడో ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే, మంజు వారియర్ (ప్రియదర్శిని రాందాస్) కుటుంబ బాధ్యతలను ఎలా నిర్వహిస్తున్నదీ భావోద్వేగపూరితంగా చూపించారు. అయితే, కథలో కొన్ని చోట్ల నెమ్మదిగా నడుస్తుందని అనిపించవచ్చు.

కథ మలుపు తిరిగే సన్నివేశంలో స్టీఫెన్ నిజమైన లక్ష్యం ఏమిటి? అతను ఎందుకు అంతటి స్థాయికి చేరుకున్నాడో అర్థమవుతుంది. అంతర్జాతీయ కుట్రలు, రాజకీయ వ్యూహాలు ఉత్కంఠను మరింత పెంచుతాయి. అద్భుతమైన విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో క్లైమాక్స్ హైలైట్‌గా నిలుస్తుంది. క్లైమాక్స్ లో మూడో భాగానికి లీడ్ ఇవ్వడం ఆకట్టుకుంటుంది.

నటీనటుల ప్రదర్శన:

స్టీఫెన్ పాత్రలో మోహన్‌లాల్ మరోసారి అద్భుతంగా నటించారు. ఆయన డైలాగ్ డెలివరీ, శరీర భాష, భావప్రదర్శన సినిమాకు ప్రధాన బలం. మలయాళ రాజకీయ నాయకుడిగా టోవినో థామస్ పాత్ర బలంగా నిలుస్తుంది. మంజు వారియర్ భావోద్వేగ దృశ్యాల్లో మెప్పించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర కథలో కీలక మలుపును తీసుకువచ్చేలా ఉంది.

టెక్నికల్ ఆస్పెక్ట్స్:

సుజిత్ వాసుదేవ్ కెమెరా పనితనం ప్రపంచస్థాయిలో ఉంది. దీపక్ దేవ్ నేపథ్య సంగీతం సినిమాకు ఓ కొత్త లెవెల్ తీసుకొచ్చింది. వీఎఫె ఎక్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో తీర్చిదిద్దారు.

ప్లస్ పాయింట్స్:

మోహన్‌లాల్ పవర్‌ఫుల్ నటన

గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే

ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు

హై-క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్

క్షణక్షణం ఉత్కంఠగా ఉండే కథనం

మైనస్ పాయింట్స్:

కొంతవరకు నెమ్మదిగా నడిచే స్క్రీన్‌ప్లే

కొన్ని పాత్రలకు ఎక్కువ స్థానం ఇవ్వడం వల్ల కథలో కొన్ని సీన్లు పొడవుగా అనిపించవచ్చు

చివరిగా..

'ఎల్ 2: ఎంపురాన్' కథన పరంగా అద్భుతంగా తీర్చిదిద్దిన పొలిటికల్-ఇంటెలిజెన్స్ థ్రిల్లర్. మోహన్‌లాల్ నటన, పృథ్వీరాజ్ దర్శకత్వం, హై-ఎండ్ టెక్నికల్ వర్క్ సినిమాను బలంగా నిలబెట్టాయి. కొంత నెమ్మదిగా నడిచినప్పటికీ, కథ ఉత్కంఠను ఏమాత్రం తగ్గించదు. లూసిఫర్ అభిమానులకు తప్పకుండా నచ్చే సినిమా.


T70mm Rating : 2.5/5

Tags:    

Similar News