మ్యాడ్ స్క్వేర్ USA రివ్యూ:
సితారా ఎంటర్టైన్మెంట్స్ లో ‘మ్యాడ్ చాలా స్ట్రాంగ్ వైబ్స్ ని క్రియేట్ చేసింది.
కంటెంట్ తో కమర్షియల్ హిట్ సాధించి మ్యాడ్ స్క్వేర్ కి ఊహించిన ఓపెనింగ్స్ ని సాధించగలిగింది..
కథ గా చూసుకుంటే మ్యాడ్ లో బాగా ఆకట్టుకున్న లడ్డు గాని పెళ్ళితో మొదలవుతుంది..
మనోజ్ , అశోక్ , దామోదర్ చేసిన అల్లరితో అదిరిపోతుంది.
మురళీధర్ గౌడ్ సెంకండ్ పార్ట్ లో కూడా స్ట్రాంగ్ కామెడీ ని అందించాడు.
లడ్డు పాత్రలోని అమాయకత్వం తో పాటు మనోజ్,అశోక్, దామోదర్ పాత్రలు చేసే అల్లరి థియేటర్స్ ని హోరెత్తించాయి.
కళ్యాణ్ రాసిన పంచ్ లు వన్ లైనర్స్ బాగా పేలాయి.
లడ్డు గానిపెళ్ళి పాట థియేటర్స్ లో మంచి కిక్ నిచ్చింది.
పెళ్లి అయ్యింది గాని ....పార్టీ గోవాలో చేద్దాం అనే సెంకండాఫ్ టేకాఫ్ అవుతుంది.
అప్పటికే వీరి క్యారెక్టర్స్ ఇచ్చిన హైఫన్ తో లాజిక్ లు అసలు గుర్తుకురావు.
గోవాలో హోటల్ ఓనర్ గా రఘబాబు తనదైన కామెడీతో నవ్వించాడు.
ప్రియాంక జ్వాలాకర్ పాత్ర చాలా ఇంపార్టెంట్. డిజె టిల్లు స్క్వేర్ లో మెరిసిన ఈ తెలుగందం ఈ సారి మ్యాడ్ స్క్వేర్ లో మరింత మత్తెక్కించింది.
కథకి కూడా మంచి టర్న్ ఇచ్చింది.
ఇక సెంకండాఫ్ లో వచ్చే స్వాతి రెడ్డి హైఫీస్ట్ ..
రెబా మోనికాజాన్ తన ఇమేజ్ మంచి ఛేంజోవర్ గా ఈ పాట నిలుస్తుంది.
గోవాలో ఒక క్రైంలో ఇరుక్కున మ్యాడ్ టీంతో సునీల్ & సత్యం రాజేష్ చేసిన ఫన్ నెక్ట్స్ లెవల్ లో ఉంది.
చాలా రోజుల తర్వాత సునీల్ & సత్యం రాజేష్ ఫన్ ని మల్టిప్లై చేశారు.
థియేటర్స్ లో మన ఫ్రెండ్స్ గ్యాంగ్స్ తో సెలబ్రేట్ చేసుకునే విధంగా ఉంది.
దర్శకుడు కళ్యాణ్ మ్యాడ్ స్క్వేర్ తో తన సక్సెస్ ప్లూక్ కాదని నిరూపించుకున్నాడు.
అదేవిధంగా ద్వితీయ విఘ్నం దాటాలంటే "సితార బ్యానర్"లో సినిమా చేయాలి అన్న సెంటిమెంట్ ని "కళ్యాణ్ శంకర్" కూడా విజయవంతంగా దాటాడు.
సితారా ఎంటర్టైన్మెంట్స్ కి టిల్లు స్క్వేర్ & మ్యాడ్ స్క్వేర్ లు మంచి అసెట్ గా మిగులుతాయి అని చెప్పడంలో సందేహం లేదు..
ఈ సమ్మర్ కి ఫస్ట్ హిట్ కొట్టారు.. మ్యాడ్ స్క్వేర్ టీం..