'మ్యాడ్ స్క్వేర్' రివ్యూ

టాలీవుడ్ లో సీక్వెల్స్ కి సెపరేట్ క్రేజ్ తీసుకొస్తుంది సితార ఎంటర్ టైన్ మెంట్స్. ఇప్పటికే ‘డీజె టిల్లు‘ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్‘తో ఘన విజయాన్నందుకున్న ఈ సంస్థ.. తాజాగా ‘మ్యాడ్‘ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్‘ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.;

By :  S D R
Update: 2025-03-28 07:07 GMT

చిత్రం:'మ్యాడ్ స్క్వేర్'

నటీనటులు: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, ప్రియాంక జవాల్కర్, సునీల్, సత్యం రాజేష్, విష్ణు తదితరులు

సినిమాటోగ్రఫీ: శామ్‌దత్

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

ఎడిటింగ్‌: నవీన్ నూలి

నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య

దర్శకత్వం: కళ్యాణ్ శంకర్

విడుదల తేది: 28-03-2025

టాలీవుడ్ లో సీక్వెల్స్ కి సెపరేట్ క్రేజ్ తీసుకొస్తుంది సితార ఎంటర్ టైన్ మెంట్స్. ఇప్పటికే ‘డీజె టిల్లు‘ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్‘తో ఘన విజయాన్నందుకున్న ఈ సంస్థ.. తాజాగా ‘మ్యాడ్‘ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్‘ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మ్యాడ్‘తో అల్లరి పంచిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ సీక్వెల్ లోనూ సందడి చేశారు. మరి.. ‘మ్యాడ్ స్క్వేర్‘ అల్లరి ఏ రేంజులో ఉందో ఈ రివ్యూలో చూద్దాం.


 



కథ:

కథ గణేష్ అలియాస్ లడ్డు (విష్ణు) జైలులో ఉండే సన్నివేశంతో ప్రారంభమవుతుంది. లడ్డుకి పెళ్లి నిశ్చయమై, ఎంగేజ్‌మెంట్ కూడా పూర్తవుతుంది. పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిన విషయం తెలిసిన అతని ముగ్గురు స్నేహితులు—మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్ అలియాస్ డిడి (సంగీత్ శోభన్)—పెళ్లి వేడుకకు హాజరవుతారు. అయితే వాళ్ళ రాకతో లడ్డుకి అనేక సమస్యలు మొదలవుతాయి. వాళ్ళు ఏదైనా తప్పుచేస్తే పెళ్లే ఆగిపోతుందేమోననే భయంతో లడ్డు ఉండగా, ఊహించని మలుపులో పెళ్లి రోజు అతను వివాహం చేసుకోవాలనుకున్న అమ్మాయి ముహూర్త సమయానికి మాయమవుతుంది.

ఇంతలోనే లడ్డు తన హనీమూన్ కోసం గోవాలో ఒక రిసార్ట్‌ను ముందుగానే బుక్ చేస్తాడు. పెళ్లి రద్దయిన కారణంగా అది కూడా రద్దు చేసుకోబోయే సమయంలో, ‘‘హనీమూన్ కాకపోతే ఏంటి? ఇక గోవాకి వెళ్లి ఎంజాయ్ చేద్దాం!’’ అంటూ మనోజ్, అశోక్, డిడి అతన్ని బలవంతంగా అక్కడికి తీసుకెళ్తారు. అయితే గోవాలో వాళ్లంతా అనుకోని పరిస్థితుల్లో ఓ క్రైమ్‌లో ఇరుక్కుంటారు. మరి.. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

‘మ్యాడ్ స్క్వేర్‘ లో కథాపరంగా చెప్పుకోదగిన విషయం ఏమీ కనిపించదు. ఈ సినిమాలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ ప్రేక్షకులను బోర్ అనిపించకుండా ఎంటర్‌టైన్ చేయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాడు.

సినిమాలో ముఖ్యంగా లడ్డు పెళ్లి ఎపిసోడ్ ఆకట్టుకోగా, ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసే కామెడీ సీన్లు నవ్వులు పూయించాయి. మురళీధర్ గౌడ్ తన టైమింగ్‌తో మెప్పించగా, ఇంటర్వెల్ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. కథనం సగం ప్రెజెంట్‌లో, సగం ఫ్లాష్‌బ్యాక్‌లో నడుస్తూ సాగిపోతుంది.

మొత్తంగా ‘మ్యాడ్ స్క్వేర్‘ మూవీ జోష్ ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ పెళ్లి ఎపిసోడ్ ఫుల్ ఫన్ చేస్తే.. సెకండ్ హాఫ్ మొత్తం సునీల్, సత్యం రాజేష్ దాన్ని డబుల్ డోస్ ఇచ్చారు. ద్వితీయ విఘ్నం దాటాలంటే ‘సితార బ్యానర్‘లో సినిమా చేయాలి అన్న సెంటిమెంట్ ని కళ్యాణ్ శంకర్ కూడా విజయవంతంగా దాటాడు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు:

‘మ్యాడ్ స్క్వేర్‘ చిత్రంలో ముగ్గురు హీరోలతో పాటు విష్ణు (లడ్డు) పాత్ర కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ నలుగురూ తమ పాత్రలతో ఫుల్ ఎంటర్ టైన్ చేశారు. అలాగే, మురళీధర్ గౌడ్, సత్యం రాజేష్ తమ టైమింగ్ తో కామెడీ ట్రాక్స్‌ను బాగా నడిపించారు. ఇంకా సునీల్, రఘుబాబు వంటి అనుభవజ్ఞులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. ఇలాంటి సినిమాలకు ఎడిటింగ్ ఎంతో కీలకం, దానిని ఎడిటర్ చక్కగా నిర్వహించాడని చెప్పాలి. సంగీతం విషయానికొస్తే, భీమ్స్ మ్యూజిక్‌లో వచ్చిన ‘లడ్డు గాని పెళ్లి, స్వాతి రెడ్డి‘ పాటలు మాస్ అప్పీల్ కలిగించి ఆకట్టుకున్నాయి. ‘మ్యాడ్ స్క్వేర్‘ లో స్టోరీ లేకున్నా కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం విజయవంతమైందని చెప్పొచ్చు. కథ లేకపోయినా రెండు గంటల పాటు ప్రేక్షకులను కుర్చోపెట్టడం దర్శకుడి మేటి అచీవ్‌మెంట్. సితార నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:

‘మ్యాడ్ స్క్వేర్‘.. నో లాజిక్స్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్


T70mm Rating : 3.25/5


Tags:    

Similar News