హైదరాబాద్ లో వీధి పప్పీల అడాప్షన్ డ్రైవ్

సుప్రీంకోర్ట్ ఆదేశంలతో GHMC తీసుకువచ్చిన కొత్త అడాప్షన్ డ్రైవ్ - ఆరోగ్యవంతమైన, టీకాలు పొందిన, డీ-వార్మ్డ్ వీధి పప్పీలు మీ కోసం;

Update: 2025-08-14 09:39 GMT

హైదరాబాద్‌లో వీధి కుక్కల సంక్షేమం కోసం రెండు ముఖ్యమైన కార్యక్రమాలు చోటు చేసుకోనున్నాయి. ఒకవైపు, సుప్రీంకోర్టు 2025 ఆగస్టు 11న ఢిల్లీ–NCRలోని అన్ని అవారా (stray) కుక్కలను శెల్టర్లలో ఉంచాలని ఆదేశించింది. ఈ శెల్టర్లు 5,000 కుక్కలకు సరిపడే విధంగా ఉండాలి, వాటికి ఆహారం, నీరు, వైద్య సేవలు, టీకాలు అందించాలి. అయితే, ఈ ఆదేశంలో ఇప్పటికే ఉన్న Animal Birth Control (ABC) నియమాలకు విరుద్ధంగా ఉందని, జంతు హక్కుల సంస్థలు, రాజకీయ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ABC ప్రకారం, కుక్కలను స్టెరిలైజ్ చేసి, టీకాలు వేసి మళ్లీ వాటిని వాటి నివాస స్థలంలో వదిలేయాలి.

సుప్రీం కోర్ట్ తీసుకున్న ఈ నిర్ణయం దేశంలో అమల్లోకి రావడం సవాళ్లతో కూడిన విష్యం. ఢిల్లీలో ఇప్పటికే శెల్టర్లు పూర్తి సామర్థ్యంతో నిండిపోయాయి. ఇతర నగరాల్లో, ఉదాహరణకు నాగ్‌పూర్‌లో, వంటి రాష్ట్రంలో బడ్జెట్, స్థలాలు, సిబ్బంది కొరత కారణంగా కొత్త ఆదేశాన్ని అమలు చేయడం కష్టం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి BR గవై ఈ తీర్పులను పరిశీలించి, మూడు న్యాయమూర్తుల బెంచ్ ద్వారా తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇంతలో, ప్రజలు మరియు జంతు సంక్షేమ సంస్థలు ఈ అంశంపై నిరసనలు, వాదనలు చేస్తున్నారు.

అలాగే, హైదరాబాద్ GHMC కూడా జంతు సంక్షేమానికి సానుకూలత చూపుతోంది. వారు ఇండీ డాగ్ పప్పీ అడాప్షన్ డ్రైవ్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం 2025 ఆగస్టు 17 (ఆదివారం), ఉదయం 6:00 నుండి 10:00 వరకు జలగం వెంకల్ రావు పార్క్, బంజారా హిల్స్ వద్ద జరుగుతుంది. ఇక్కడ ఆరోగ్యవంతమైన, టీకాలు ఇచ్చిన, డి వార్మింగ్ చేయబడ్డ వీధి పప్పీలు ఉచితంగా దత్తత కోసం అందుబాటులో ఉంటాయి.

ప్రజలు ఈ కార్యక్రమంలో చేరి పప్పీలను కలుసుకోవచ్చు,వారికీ నచ్చినవి ఇంటికి తీసుకురావచ్చు. ఒక పప్పీని దత్తత తీసుకోవడం ద్వారా వీధి కుక్కల సంఖ్య తగ్గడంలో సహాయం అవుతుంది మరియు ఈ జంతువులకు సురక్షితమైన, ప్రేమతో నిండిన వాతావరణం అందుతుంది. వీధి కుక్కలు ఆటపాట, విశ్వసనీయత, తక్కువ శ్రద్ధ అవసరం వంటి లక్షణాలతో ప్రసిద్ధి చెందాయి, కాబట్టి కుటుంబాలు, వ్యక్తులు కోసం చక్కని తోటి మిత్రులు అవుతాయి.

ఈ రెండు ఘటనలు ఒకేసారి చూపిస్తున్నాయి: జంతు సంక్షేమం కోసం చట్టాలు, ప్రభుత్వ చర్యలు, మరియు పౌరుల ప్రేమ, బాధ్యత కలిపి పని చేయాలి. వీధి కుక్కల సమస్యను తగ్గించడం,వీధి పప్పీలకు ఇల్లు, ప్రేమ అందించడం ద్వారా ఈ సమస్యను కొంత వరకూ తగ్గించవచ్చు వచ్చు అని జంతు ప్రేమికుల ఆలోచన.

Tags:    

Similar News