బస్సులో మహిళలతో సీఎం,డిప్యూటీసీఎం
ఉండవల్లి నుంచి విజయవాడ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం - సాదాసీదాగా ప్రజల్లో కలిసిపోయిన నేతలు;
By : Dasari Suresh
Update: 2025-08-15 13:05 GMT
ఉండవల్లి సెంటర్ నుంచి తాడేపల్లిలోని భారత మాత విగ్రహం, వారధి మీదుగా విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
ఈ ప్రయాణంలో సీఎం చంద్రబాబు బస్సులో ఉన్న మహిళా ప్రయాణికులతో కాసేపు కూర్చొని మాట్లాడారు. వారి రోజు వారి ప్రయాణ అవసరాలు, కుటుంబ జీవనోపాధికి సంబంధించిన సమస్యలు, కష్టాలు, సవాళ్లు నేరుగా అడిగి తెలుసుకున్నారు.
ప్రతి బస్టాప్ వద్ద బస్సు ఎక్కే, దిగే మహిళలతో కూడా సీఎం సాదాసీదాగా పలకరించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. బస్సు ప్రయాణం మొత్తం ప్రజలతో కలిసిపోయి, వారి మనసులోని మాట విని, సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు.