పిఠాపురంలో మహిళలకు పవన్ కళ్యాణ్ రాఖీ కానుక
1,500 వితంతు మహిళలకు పవన్ కళ్యాణ్ రాఖీ కానుకలు పంపిణీ - జనసేన కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి చీరల అందజేత;
అన్నా–చెల్లెళ్ల పండుగ రాఖీ పౌర్ణమి సందర్భంగా, పిఠాపురం నియోజకవర్గానికి చెందిన సుమారు 1,500 మంది వితంతు మహిళలకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక రాఖీ కానుకలు పంపించారు. స్థానిక జనసేన కార్యకర్తల ద్వారా ఈ చీరలు మహిళల ఇంటివద్దకే అందజేయబడ్డాయి.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు, భర్తను కోల్పోయిన మహిళలకు సోదరుడిగా అండగా ఉంటాననే నమ్మకం కల్పించేందుకు, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ స్థానిక నాయకులకు ఆదేశించారు. ఆయన తరఫున జనసేన పార్టీ కార్యకర్తలు,పార్టీ అధినేతలు మహిళల ఇళ్లకు వెళ్లి చీరలను అందజేసి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఊహించని రక్షాబంధన్ కానుక పట్ల మహిళలు కృతజ్ఞతాభావంతో స్పందించారు. భర్తలను కోల్పోయిన తరువాత బంధువుల సైతం నిర్లక్ష్యంగా చూసేలాంటి పరిస్థితుల్లో, తమను గౌరవంగా అక్కచెల్లెళ్లుగా స్వీకరించి కానుకలు పంపినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప మనసున్న వ్యక్తి తమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని అభిప్రాయపడ్డారు.
సమాజానికి మేలు చేయడంలో ఎల్లప్పుడూ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ముందుకు సాగే జనసేన నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఇదే విధంగా రక్షాబంధన్ కానుకల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. భర్తలను కోల్పోయిన మహిళలకు ఎలాంటి సమస్య వచ్చినా జనసేన పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.