సుప్రీంకోర్టులో లోకల్ రిజర్వేషన్ కేసు విచారణ

9వ తరగతి నుంచి 12వ తరగతి వరకే రిజర్వేషన్ నిబంధనపై విద్యార్థుల అభ్యంతరం;

Update: 2025-08-05 08:48 GMT

తెలుగు రాష్ట్రలో ఇటీవల లోకల్ నాన్ లోకల్ వివాదం విద్యార్థుల భవితవ్యానికి సవాలుగా మారింది.ఆంధ్ర రాష్ట్రము లో కూడా ఈ వివాదాలకు తలెత్తి విద్యార్థులు కోర్టు ను ఆశ్రయించారు.ఇటీవల ఏపీ హై కోర్టు నీట్ (NEET) విద్యార్థులకు తల్లితండ్రుల ఆధార్ లోకల్ రెసిడెన్సీ బట్టి వాళ్ళు లోకల్ కేటగిరీ లోనే సీట్లు కల్పించాలి అని హైకోర్టు తీర్పునించింది.నిన్న జరగవలసిన ఏపీ ఎంసెట్ 2025 నియామకాలు కూడా లోకల్ నాన్ లోకల్ వివాదం చెలరేగటం తో విద్యార్థులు హైకోర్టు ను ఆశ్రయించారు.ఏపీ గవర్నమెంట్ నియమాలని తాత్కాలికంగా వాయిదావేసింది.ఇప్పుడు ఈ అంశం తెలంగాణ విద్యార్థులు సుప్రీంకోర్టు లో పోరాటం చేస్తున్నారు.

తెలంగాణలో లోకల్ రిజర్వేషన్ విధానానికి సంబంధించి సుప్రీంకోర్టులో మంగళవారం ఉదయం నుంచి సుదీర్ఘంగా విచారణ సాగింది. దాదాపు రెండున్నర గంటలపాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ఈ వ్యవహారంపై తుది తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం, ఇరు పక్షాలు తమ తమ లిఖితపూర్వక వాదనలు వచ్చే శుక్రవారం (ఆగస్టు 9) లోగా సమర్పించాలని ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్రంలో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదివిన విద్యార్థులకే లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను కొంతమంది నీట్ అభ్యర్థులు సవాల్ చేశారు. వారు దాఖలు చేసిన పిటిషన్‌లో, విద్యార్థులు తెలంగాణలోనే పుట్టినా, తల్లిదండ్రుల బదిలీ వల్ల లేదా ఇతర కారణాలతో రెండు సంవత్సరాలు రాష్ట్రం వెలుపల చదివితే వారికి రిజర్వేషన్ వర్తించకపోవడం అన్యాయం అని పేర్కొన్నారు.

విచారణలో ప్రధాన న్యాయమూర్తి గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణలో జన్మించి, పై చదువుల కోసం తాత్కాలికంగా రెండు సంవత్సరాలు రాష్ట్రం వెలుపల చదివిన విద్యార్థులను రిజర్వేషన్ నుంచి ఎలా మినహాయిస్తారు?” అంటూ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. అలాగే, తల్లిదండ్రుల ఉద్యోగ బదిలీల వల్ల రాష్ట్రం వెలుపల చదివే విద్యార్థుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. "వారు తెలంగాణ వారే కదా, ఆ విషయంలో సందేహమేంటీ?" అంటూ విద్యార్థుల తరపు న్యాయవాది గవాయి ధర్మాసనంకు స్పష్టం చేసారు.

ఇప్పుడు తీర్పు రిజర్వ్ కావడంతో, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యా సంస్థలు—సుప్రీంకోర్టు తీర్పుపై అందరి దృష్టి నిలిచి ఉంది. ఈ తీర్పు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపనుండటంతో తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది. వచ్చే శుక్రవారం లిఖితపూర్వక వాదనలు అందిన తర్వాత తుది తీర్పు వెలువడనుంది.

Tags:    

Similar News