కైకలూరులో రంగాకు అవమానం – సీఎం స్పందన

ప్రజల ఆగ్రహం ఉధృతం – రంగా అభిమానుల భావోద్వేగాలు దెబ్బతిన్నాయి - నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోమని సీఎం ఆదేశాలు;

Update: 2025-08-23 10:46 GMT

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండిలో వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు అవమానపరిచారు. ఈ ఘటన అక్కడి ప్రజల్లో, ముఖ్యంగా మోహనరంగా అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. రంగా విగ్రహాన్ని అవమానించడం వల్ల అక్కడి వాళ్ల భావోద్వేగాలను గాయపరిచింది.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. నేతల విగ్రహాలను అవమానించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. రంగా అభిమానుల మనోభావాలను దెబ్బతీసేలా, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఈ చర్య ఉందని ఆయన అన్నారు.నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం పోలీసు అధికారులను ఆదేశించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారికి గట్టి గుణపాఠం చెప్పాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు మళ్లీ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సంఘటనపై తెలుగుదేశం పార్టీ నేత కామినేని శ్రీనివాస్ ఘటన స్థలానికి వెళ్లి విగ్రహాన్ని శుభ్రపరిచారు. ఆయన ఈ చర్యతో అక్కడి ప్రజలను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.రంగా అభిమానులు ఈ అవమానకర చర్యపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలు నేతల విగ్రహాలను గౌరవించడం అందరి బాధ్యత అని భావోద్వేగంతో తెలిపారు.

Tags:    

Similar News