కొండా సురేఖ మంత్రి పదవిపై అనుమానాలు

కొండా సురేఖ పై విచారణ కమిటీ వేసిన కాంగ్రెస్ అధిష్టానం;

Update: 2025-06-23 12:34 GMT

వివాదాస్పదమైన వివాదాల్లో నిత్యం ఉంటారు మంత్రి కొండా సురేఖ, ఈ మధ్య ఈమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గ మారాయి.సొంత పార్టీ మనుషులపైన సురేఖ వివాదాస్పదమైన కామెంట్స్ చేస్తున్నారు,మంత్రి సురేఖ ప్రవర్తన వల్ల కాంగ్రెస్ శ్రేణుల్లో విపరీతమైన వివక్షత చోటు చేసుకుంది.మంత్రి అయినప్పటి నుంచి ఆమె అనేక వివాదాలలో ఉంటున్నారు దీనికి కారణం ఆమె నోరు అదుపులో పెట్టుకోలేక పోవటమే.రేవంత్ రెడ్డి కాబినెట్ లో ఈమె ఒక వివాదాస్పదమైన మంత్రిగా ముద్రకూడా పడింది.

మంత్రి అయినప్పటినుంచి ఆమె వ్యవహార శైలి నచ్చక చాలా మంది కాంగ్రెస్ నాయకులు అధిష్టానానికి పిర్యాదు చేసారు,అధిష్టానం కూడా ఇప్పటి వరకు ఆమెపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు.ఎందుకంటే ఆమె తెలంగాణలో బలమైన సామజిక వర్గం,పద్మశాలి బీసీ సామాజికవర్గం చెందిన ఆమె కావటం వల్ల, రిజర్వేషన్ పరిస్థితుల దృష్ట్యా సురేఖ గార్ని ఏమి అనలేకపోతున్నారు.అసలే ఈ మధ్య ప్రతి ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ లు ఇదే సాకుతో మంత్రిపదవి కోసం పోటీ పడుతున్నారు.ఈ మధ్య విజయశాంతి కూడా తన సామజికవర్గం కోటాలో మంత్రి పదవి కోసం ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు.

ఈ మధ్య రాజీవగాంధీ జయంతి రోజున మరో కొత్త వివాదాని లేవతీసారు మంత్రి సురేఖ.ఈ సారి ఆమెతో పాటు భర్త మురళి కూడా జతకలిసారు.దీనికి ముఖ్య కారణం వరంగల్ జిల్లా నాయకులతో వాళ్లకు ఉన్న గొడవలు,ఇప్పుడు ఈమె చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పెద్దలు సీరియస్ గా తీసుకున్నారు.కాంగ్రెస్ పార్టీ లో తాము ఉండాలో ఆమె ఉండాలో తేల్చుకోమని కాంగ్రెస్ అధిష్టానానికి సీరియస్ గానే చెప్పినట్టు తెలుస్తుంది.

ఈ సారి ఆమె భర్త వంతుగా మొదలుపెట్టారు మాజీ మంత్రి కడియం శ్రీహరి మీద నోరుపారేసుకున్నారు,తాను ఏమి తక్కువ కాదు అని సురేఖ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడారు.ఈ విషయమై కాంగ్రెస్ సీనియర్ నాయకులు కడియం శ్రీహరి,నాయిని రాజేంద్రరెడ్డి ,రేవూరి ప్రకాశరెడ్డి అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కు పిర్యాదు చేసారు.

త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ని కలిసి పిర్యాదు చేయాలి అని నిర్ణయించుకున్నారు.మంత్రి కొండా సురేఖ పై ఎటువంటి విచారణ జరపని పార్టీ ,ముగ్గురు కమీటీ సభ్యులతో విచారణకు ఆదేశించింది.ఒకవేళ ఆమె పై విచారణ నిరూపణ అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము అని పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తెలియచేసారు.త్వరలోనే మంత్రి సురేఖ మంత్రి పదవి ఉంటుందో లేదో చూడాలి.

Tags:    

Similar News