అమెరికా ప్రమాణాలతో ‘ఆల్ఫాలీట్’ హెల్త్ సప్లిమెంట్స్
సోనూ సూద్, మిస్ ఇండియా మానస హాజరుతో ట్రైడెంట్ హోటల్‌లో గ్రాండ్ లాంచ్;
భారతదేశంలో పూర్తిగా పారదర్శకంగా, ల్యాబ్‌లో పరీక్షించిన, అమెరికా ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన హెల్త్ సప్లిమెంట్లను అందించాలనే లక్ష్యంతో ‘ఆల్ఫాలీట్’ (Alphlete) అనే కొత్త బ్రాండ్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. నగరంలోని ట్రైడెంట్ హోటల్‌లో జరిగిన ఈ గ్రాండ్ లాంచ్ వేడుకలో ప్రముఖ నటుడు, “ఇండియన్ రియల్ హీరో”గా పేరుగాంచిన సోనూ సూద్ ముఖ్య అతిథిగా హాజరై బ్రాండ్‌ను ఆవిష్కరించారు.
ఈ వేడుకకు సోనూ సూద్‌తో పాటు మిస్ ఇండియా మానస కూడా ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. “Authentic – Exclusive – Performance” అనే నినాదంతో ప్రజల ముందుకు వచ్చిన ఆల్ఫాలీట్, ఆరోగ్యాన్ని ప్రోత్సహించే అత్యుత్తమ సప్లిమెంట్లను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ,ఆల్ఫాలీట్ వంటి అద్భుతమైన బ్రాండ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఫౌండర్లు సురేష్ శుక్లా, శ్రవణ్ ఘంటలకు హృదయపూర్వక అభినందనలు తెలియచేసారు.
యువత, ఫిట్‌నెస్ అభిరుచి ఉన్నవారు నమ్మకమైన బ్రాండ్లను ఎంచుకోవాలి. ఆ నమ్మకాన్ని నిలబెట్టే బ్రాండ్‌గా ఆల్ఫాలీట్ నిలుస్తుందని నమ్ముతున్నాను అన్నారు సోనూ సూద్. ఈ బ్రాండ్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.
ఈ సందర్భంగా ఆల్ఫాలీట్ ఫౌండర్ & సీఈఓ సురేష్ శుక్లా మాట్లాడుతూ,భారత సప్లిమెంట్ మార్కెట్లో విశ్వసనీయత, పారదర్శకత కొరవడింది అని, ఈ లోటును పూరించేందుకే ఆల్ఫాలీట్‌ను ప్రారంభించాం అన్నారు. అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి, ఫిట్‌నెస్, బాడీబిల్డింగ్‌పై ఉన్న మక్కువతో, భారతీయ వినియోగదారులకు 100% అసలైన, క్యూ ఆర్-కోడ్ వెరిఫైడ్, యూఎస్ ప్రమాణాలతో కూడిన ల్యాబ్-టెస్టెడ్ సప్లిమెంట్లను అందించాలనే సంకల్పంతో ఈ ప్రయాణం మొదలుపెట్టాం అని శుక్లా వివరించారు.
ఆల్ఫాలీట్ కో-ఫౌండర్ & సీఎఫ్ఓ శ్రవణ్ ఘంట మాట్లాడుతూ,సురేష్ శుక్లా ఆలోచన నచ్చి ఈ ప్రయాణంలో భాగస్వామి అయ్యాను, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా, సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే బ్రాండ్‌ను నిర్మించడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు.
తమ ఉత్పత్తులు పూర్తిగా ల్యాబ్‌లో పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే మార్కెట్లోకి వస్తాయని, అమెరికా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ వేడుకకు పలువురు ఫిట్‌నెస్ నిపుణులు, హెల్త్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.